EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandra-babu018fc259-56ac-4be2-afcd-79a516547855-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandra-babu018fc259-56ac-4be2-afcd-79a516547855-415x250-IndiaHerald.jpgపలువురు వీవీఐపీలకు కేంద్రం ప్రత్యేకంగా కేటాయించిన నేషనల్ సెక్యూరిటీ గార్స్డ్ ఎన్.ఎస్.జీ కమెండోల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 9 మంది వీవీఐపీలకు ఎన్.ఎస్.జీ కమాండోలను విత్ డ్రా చేసుకొని వారి స్థానంలో సీ.ఆర్. పీ. ఎఫ్ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది వీవీఐపీలకు భద్రత కల్పించిన ఎన్.ఎస్.జీ కమాండోలను విత్ డ్రా చేసుకోవాలని.. వారి స్థానంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకchandra babu{#}Farooq Abdullah.;Parliment;central government;Bharatiya Janata Party;Minister;CM;CBN;Andhra Pradesh;mediaబాబుకి మోదీ షాక్..! సెక్యూరిటీ తీసేశారు గా..?బాబుకి మోదీ షాక్..! సెక్యూరిటీ తీసేశారు గా..?chandra babu{#}Farooq Abdullah.;Parliment;central government;Bharatiya Janata Party;Minister;CM;CBN;Andhra Pradesh;mediaThu, 17 Oct 2024 10:11:00 GMTపలువురు వీవీఐపీలకు కేంద్రం ప్రత్యేకంగా కేటాయించిన నేషనల్ సెక్యూరిటీ గార్స్డ్ ఎన్.ఎస్.జీ కమెండోల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 9 మంది వీవీఐపీలకు ఎన్.ఎస్.జీ కమాండోలను విత్ డ్రా చేసుకొని వారి స్థానంలో సీ.ఆర్. పీ. ఎఫ్ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది వీవీఐపీలకు భద్రత కల్పించిన ఎన్.ఎస్.జీ కమాండోలను విత్ డ్రా చేసుకోవాలని.. వారి స్థానంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా బెటాలియన్ ను మంజూరు చేయాలని నిర్ణయించారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు.


ఇటీవల పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ ను ఈ ప్రముఖుల  భద్రత కోసం వినియోగించనున్నారని అంటున్నారు. వాస్తవానికి దేశంలో తొమ్మిది మంది వీవీఐపీలు ఎన్.ఎస్.జీ బ్లాక్ క్యాట్ కమాండోల భద్రతలో ఉన్నారు. ఇక వీరందరకీ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తారు.


వాస్తవానికి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించే ఎన్.ఎస్.జీ కమాండోలను ఇకపై పూర్తిగా ఆ పనులపై దృష్టి సారించేలా చేయడం కేంద్రం ప్లాన్ అని తెలుస్తోంది. వీరిని వీఐపీ భద్రత విధుల నుంచి తప్పించి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం అమలు అనంతరం.. సుమారు 450 మంది ఎన్.ఎస్.జీ కమాండోలు భద్రతా బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు.  కాగా ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు.. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, మాజీ సీఎం మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీనియర్ బీజేపీ నేత ఎల్ కే. ఆద్వానీ, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా వంటి వారు ఉన్నారు.


మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దొరికింది రోయ్.. దావూదీ పాటలో అదరగొట్టిన ముద్దుగుమ్మ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>