PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudunuri-murali-krishnam-raju-ycp-tdp-jagane7efef52-c631-4267-949a-8d2f1f16fa3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudunuri-murali-krishnam-raju-ycp-tdp-jagane7efef52-c631-4267-949a-8d2f1f16fa3c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది దీంతో చాలామంది నేతలు పార్టీని వీడుతున్నప్పటికీ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా జంకకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సమావేశాలను కూడా నిర్వహిస్తూ జిల్లాలలో కూడా నాయకులను నియమిస్తూ ముందుకు వెళ్తున్నారు. మొన్నటివరకు వైసీపీని వీడి టిడిపి, జనసేన, బిజెపిలోకి చేరుతున్న నేతలను చూశాము.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని వీడి మరీ వైసిపి పార్టీలోకి చేరుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల హిందూపురంMUDUNURI MURALI KRISHNAM RAJU;YCP;TDP;JAGAN{#}Prathipadu;kakinada;murali;TDP;Party;YCP;Reddyఏపీ: సీఎం చంద్రబాబుకు షాక్.. పార్టీని వీడి వైసిపిలో చేరిన టిడిపి నేత..!ఏపీ: సీఎం చంద్రబాబుకు షాక్.. పార్టీని వీడి వైసిపిలో చేరిన టిడిపి నేత..!MUDUNURI MURALI KRISHNAM RAJU;YCP;TDP;JAGAN{#}Prathipadu;kakinada;murali;TDP;Party;YCP;ReddyThu, 17 Oct 2024 13:02:00 GMTఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది దీంతో చాలామంది నేతలు పార్టీని వీడుతున్నప్పటికీ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా జంకకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సమావేశాలను కూడా నిర్వహిస్తూ జిల్లాలలో కూడా నాయకులను నియమిస్తూ ముందుకు వెళ్తున్నారు. మొన్నటివరకు వైసీపీని వీడి టిడిపి, జనసేన, బిజెపిలోకి చేరుతున్న నేతలను చూశాము.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని వీడి మరీ వైసిపి పార్టీలోకి చేరుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఇటీవల హిందూపురంలో కూడా కొంతమంది నేతలు టిడిపిని వీడి వైసీపీ పార్టీలోకి చేరారు. ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి నేత అయిన ముదునూరి మురళి కృష్ణంరాజు టిడిపి కార్యదర్శిగా ఉన్నారు. కానీ ఈయన ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి మరి వైసీపీలోకి చేరారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రత్తిపాడు లో వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మురళి కృష్ణంరాజు వెల్లడించారు. అయితే ఇక్కడ అధికార పార్టీని వీడి వైసిపి పార్టీ లోకి చేరడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ముదునూరు మురళి కృష్ణంరాజు 2023లో వైసీపీని వీడు టిడిపిలోకి చేరగా టిడిపి కార్యదర్శిగా ఆయనన నియమించారు. అయితే చేరినప్పటి నుంచి అక్కడ టిడిపిలో చేయడంతో చాలామందికి నచ్చలేదట.. చాలామంది నేతలు కూడా ఈయన పైన చాలా ఘాటుగానే దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో పాటుగా ఎన్నికలలో మురళి రాజు టిడిపికి ద్రోహం చేశారని ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థుల కోసం పనిచేయకుండా వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేల కోసమే పనిచేశారనే విధంగా ఆరోపణలు రావడంతో ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేశారట. దీంతో అప్పటినుంచి టిడిపి క్యాడర్ టిడిపి నేతపైన విమర్శలు చేస్తున్నారు చివరికి టిడిపిని వీడి వైసీపీ పార్టీలోకి చేరినట్లు సమాచారం.
" style="height: 826px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>