MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sobhan-babu-jayalalitha-tollywooda33bf759-1e11-4f56-a849-767f48d442c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sobhan-babu-jayalalitha-tollywooda33bf759-1e11-4f56-a849-767f48d442c8-415x250-IndiaHerald.jpgశోభన్ బాబు.. సౌత్ ఇండస్ట్రీలో సోగ్గాడు ఎవరయ్యా అంటే అందరికీ మొదటిగా గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు మాత్రమే. ఈయన మరణించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈయన పేరు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో మాసిపోలేదు.ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడుగా ఉన్న ఈయన్నీ చూసి కేవలం మామూలు అమ్మాయిలే కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా మనసు పడే వారట.అలా శోభన్ బాబు అందానికి దాసురాలైన తమిళనాడు సీఎం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా శోభన్ బాబే ఇష్టంగా బతికింది. అయితే అలాంటి శోభన్ బాబు హీరో గా అవకాశాలు తగ్గాక చాలా సినిమాల్లో తంSOBHAN BABU; JAYALALITHA; TOLLYWOOD{#}Soggadu;sobhan babu;Chennai;Tamilnadu;Father;Telugu;marriage;Girl;Heroఆ అమ్మాయి చేసిన పనికి చచ్చే వరకు బయట కనిపించని శోభన్ బాబు..?ఆ అమ్మాయి చేసిన పనికి చచ్చే వరకు బయట కనిపించని శోభన్ బాబు..?SOBHAN BABU; JAYALALITHA; TOLLYWOOD{#}Soggadu;sobhan babu;Chennai;Tamilnadu;Father;Telugu;marriage;Girl;HeroThu, 17 Oct 2024 15:48:00 GMTశోభన్ బాబు.. సౌత్ ఇండస్ట్రీలో సోగ్గాడు ఎవరయ్యా అంటే అందరికీ మొదటిగా గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు మాత్రమే. ఈయన మరణించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈయన పేరు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో మాసిపోలేదు.ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడుగా ఉన్న ఈయన్నీ చూసి కేవలం మామూలు అమ్మాయిలే కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా మనసు పడే వారట.అలా శోభన్ బాబు అందానికి దాసురాలైన తమిళనాడు సీఎం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా శోభన్ బాబే ఇష్టంగా బతికింది. అయితే అలాంటి శోభన్ బాబు  హీరో గా అవకాశాలు తగ్గాక చాలా సినిమాల్లో తండ్రి పాత్రలు చేసే అవకాశం వచ్చిందిట.కానీ ఆయన నేను బతుకునన్ని రోజులు హీరో గానే ఉంటాను. చనిపోయే వరకు కూడా నన్ను అందరూ హీరో గానే గుర్తుపెట్టుకోవాలి శోభన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు అనే మాటలు రాకూడదు. 

అందుకే నేను హీరో గానే చనిపోవాలి అనుకుంటున్నాను ఏ సినిమాలో కూడా కీలక పాత్రల్లో నటించను అని దర్శక నిర్మాతలకు తెగేసి చెప్పారట.అంతేకాదు కోట్ల పారితోషకం ఇస్తానని చెప్పినా కూడా శోభన్ బాబు తలొగ్గలేదట. ఇక సినిమాలో ఆఫర్స్ తగ్గాక తన ఆస్తిపాస్తులు అన్ని చూసుకుంటూ మద్రాస్ లో తనకు ఇష్టమైన కారులో చక్కర్లు కొట్టే వారట. అంతేకాదు ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్లు లేక సెలబ్రెటీల ఇంట్లో ఫంక్షన్లకు కూడా ఈయన అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు. కానీ ఓ అమ్మాయి మాట్లాడిన మాటలకు ఆయన చచ్చే వరకు కూడా ఇంటి నుండి బయటకు రాలేదట. ఇక అసలు విషయం ఏమిటంటే.. శోభన్ బాబుకు ఏజ్ మీద పడ్డాక హీరో అవకాశాలు తగ్గిపోయాయి.

ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా పులిస్టాప్ పెట్టారు. అయితే ఓ రోజు ఫంక్షన్ కి వెళ్ళిన సమయంలో ఓ అమ్మాయి శోభన్ బాబుని చూసి ఏంటండీ శోభన్ బాబు గారు.. మీకు ఏజ్ మీద పడింది.ముసలి రూపం వస్తుంది అంటూ మాట్లాడిందట. ఇక ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు ఇంటికి వెళ్లి ఎంతో బాధపడిన శోభన్ బాబు అప్పటినుండి బయటి ఫంక్షన్లకు రావడమే మానేశారట. ఆయనకు ఎంత పెద్ద అవసరం వచ్చినా కూడా ఇంట్లో నుండి బయటికి రాకుండా తన కొడుకులు, పని వారితోనే ఆ పని చేయించుకునే వారట.కానీ ఇంట్లో నుండి బయటికి రాలేదు .అందుకే శోభన్ బాబు చివరి రోజుల్లో ఎలా ఉండేవారో కూడా ఎవరికి తెలియదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జమిలి ఎన్నికలు: యాత్ర మొదలు పెట్టబోతున్న జగన్.. బాబుకు చుక్కలేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>