MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/saidharam-tejcb739c26-6ed2-47f1-82a3-7361baeaf9a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/saidharam-tejcb739c26-6ed2-47f1-82a3-7361baeaf9a2-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో విజయాల కంటే అపజయాలు ఎక్కువ పలకరించాయి. తన మామయ్యల మేనరిజంలను కాపీ చేస్తున్నాడని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడని, ఇలాగె చేస్తే కెరీర్ కష్టమే అని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బతుకు సో బెటర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు తేజ్. ఆల్రెడీ కెరీర్saidharam tej{#}kushi;sai dharam tej;Kushi;Chitralahari;Bike;Chitram;Mass;aishwarya;Hero;Cinema;India;Heroineకళ్లు చెదిరేలా విజువల్ ట్రీట్ అందించిన మెగా మేనల్లుడు..!కళ్లు చెదిరేలా విజువల్ ట్రీట్ అందించిన మెగా మేనల్లుడు..!saidharam tej{#}kushi;sai dharam tej;Kushi;Chitralahari;Bike;Chitram;Mass;aishwarya;Hero;Cinema;India;HeroineWed, 16 Oct 2024 12:45:00 GMTమెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో విజయాల కంటే అపజయాలు ఎక్కువ పలకరించాయి. తన మామయ్యల మేనరిజంలను కాపీ చేస్తున్నాడని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడని, ఇలాగె చేస్తే కెరీర్ కష్టమే అని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బతుకు సో బెటర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు తేజ్. ఆల్రెడీ కెరీర్లో పడి లేచిన తర్వాత హమ్మయ్య లైఫ్ బాగానే సాగుతుంది అనుకునే సమయంలో బైక్ యాక్సిడెంట్ అయి తన జీవితాన్నే మార్చేసింది. 2021 లో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరగ్గా తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం, చాలా రోజుల తర్వాత అతి కష్టం మీద సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు.ఇదిలావుండగా సాయి దుర్గా తేజ్ ‘బ్రో’ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో రాబోతున్నాడు. హనుమాన్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది సమాచారం. 

సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.ఈ నేపథ్యంలో ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. జనాల్లో ఈ మూవీ పై అంచనాలను పెంచేందుకు తాజాగా మేకర్స్ సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో యుద్దానికి సంబందించిన వాతావరణం కనిపిస్తుంది. పురాతనమైన ప్రాంతానికి సంబందించిన కథగా తెలుస్తుంది. ఈ వీడియోలోని బ్యాగ్రౌండ్ చూస్తుంటే సినిమాలో హీరో యోధుడి పాత్రలో కనిపించునున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ విజువల్స్ చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. కథ కాస్త కొత్తగా గతంలో ఎవ్వరూ చూపించని విధంగా ఉందని తెలుస్తుంది.. ఇక ఈ బీజిఏం సౌండ్ కు థియేటర్లు దద్దరిల్లుతాయని తెలుస్తుంది.. యాక్షన్ సీన్లతో సినిమా అదిరిపోతుందని మెగా ఫ్యాన్స్ వీడియోను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. ఏది ఏమైనా హీరో ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు.

ఇక మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లలో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ఇందులో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. భారీ జ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.ఇదిలావుండగా SDT18 సినిమా ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కెరీర్ లో అయిపోయాడు అనుకున్నప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. లైఫ్ కూడా అయిపొయింది అనుకున్నప్పుడు కష్టాలు పడైనా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అందుకే అందరూ సాయి తేజ్ ని పడి లేచిన కెరటం అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పటినుండి వాటి జోలికి వెళ్లడం లేదు.. నాగచైతన్య సెన్సేషనల్ కామెంట్స్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>