MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-853eb16e-b27e-4890-8935-a32fb2e1a4cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-853eb16e-b27e-4890-8935-a32fb2e1a4cd-415x250-IndiaHerald.jpgఒకప్పుడు వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న‌ పూరి అనుకోకుండా ప్లాప్‌లు ఎదురవటంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పురి జగన్నాథ్ సినిమాలకు టాలీవుడ్ లోనే ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే పడి చచ్చే వారు చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆస‌లు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమాగా చేసిన లైగ‌ర్ భారి డిజాస్టర్ గా మిగిలింది. director {#}vijay deverakonda;akhil akkineni;producer;Producer;puri jagannadh;News;Success;Tollywood;India;Director;Hero;Cinema;Teluguడిజాస్టర్ హీరోతో ప్లాప్ డైరెక్టర్.. ఈ సరైన సక్సెస్ కొడతారా..?డిజాస్టర్ హీరోతో ప్లాప్ డైరెక్టర్.. ఈ సరైన సక్సెస్ కొడతారా..?director {#}vijay deverakonda;akhil akkineni;producer;Producer;puri jagannadh;News;Success;Tollywood;India;Director;Hero;Cinema;TeluguWed, 16 Oct 2024 15:45:00 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ గత పది సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న‌ పూరి అనుకోకుండా ప్లాప్‌లు ఎదురవటంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పురి జగన్నాథ్ సినిమాలకు టాలీవుడ్ లోనే ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే పడి చచ్చే వారు చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆస‌లు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమాగా చేసిన లైగ‌ర్ భారి డిజాస్టర్ గా మిగిలింది.


మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వల్ గా డబుల్‌ ఇస్మార్ట్ అంటూ మరో సినిమా చేశాడు పూరి.. ఇది కూడా ఆయనకు డిజాస్టర్ గానే మిగిలింది. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్.తెలుగులోనే వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్న అక్కినేని హీరో అఖిల్ తో పూరిసినిమా చేయిబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా పూరి మరియు చార్మి కలిసి నిర్మిస్తారని కూడా అంటున్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు నిర్మాణం కూడా అవసరమా అంటూ కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు.


ఆయన మాత్రం తాను చేసే సినిమాకు తానే నిర్మాత అయితే న్యాయం జరుగుతుందని  కావలసిన బడ్జెట్ తాను పెట్టుకుంటారని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు డిజాస్టర్ హీరో అఖిల్ తో ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు పూరి జగన్నాథ్.  గతంలో విజయ్ దేవరకొండ తో ప్రయోగం చేసి ఫెయిల్యూర్ గా.. నిలిచి ఆయన కెరియర్ కి కూడా కాస్త బ్రేక్ పడేలా చేశాడు.. ఇప్పుడు మరో హీరో అంటే ఇంకా అఖిల్ ఏ లెవెల్ లో బలవుతాడో అంటూనెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.   ఏది ఏమైనా పూరి మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని.. అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్న‌రు. ఇక మరి ఈ ఇద్దరి ప్లాప్‌ కలయక వీరికి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>