MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/teja-sajja-hanuman-movie-na-saami-ranga-mahesh-babu-nagarjuna-guntur-kaaram-eagle-saindhav-venkatesh-raviteja14bc3d77-d35b-4b9f-8415-aa3d44575345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/teja-sajja-hanuman-movie-na-saami-ranga-mahesh-babu-nagarjuna-guntur-kaaram-eagle-saindhav-venkatesh-raviteja14bc3d77-d35b-4b9f-8415-aa3d44575345-415x250-IndiaHerald.jpgసంక్రాంతి అంటే కోడి పందాలు, భోగిమంటలు, రంగురంగుల ముగ్గులతో కలకల లాడుతూ ఉంటుంది. అలాంటి సంక్రాంతి సీజన్ వ్యాల్యూ సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్లకి,నిర్మాతలకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి 2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బరిలో నిలిచాయి. సంక్రాంతి బరిలో మొదటగా నిలిచిన చిత్రం గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తారు హిట్ సాధించింది. అంతేకాకుండా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చినటువంటి ఈగల్ చిత్రం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వచ్చింది. TEJA SAJJA; HANUMAN MOVIE; NA SAAMI RANGA; MAHESH BABU; NAGARJUNA; GUNTUR KAARAM; EAGLE; SAINDHAV; VENKATESH; RAVITEJA{#}Karthik;teja;Mass;Akkineni Nagarjuna;Venkatesh;mahesh babu;Industry;trivikram srinivas;Blockbuster hit;Chitram;Ravi;ravi teja;Makar Sakranti;Cinema;India2024: స్టార్స్ అయిన మహేష్, నాగ్ లకే చుక్కలు చూపించిన కుర్ర హీరో..హనుమాన్ తో అద్భుతం.!2024: స్టార్స్ అయిన మహేష్, నాగ్ లకే చుక్కలు చూపించిన కుర్ర హీరో..హనుమాన్ తో అద్భుతం.!TEJA SAJJA; HANUMAN MOVIE; NA SAAMI RANGA; MAHESH BABU; NAGARJUNA; GUNTUR KAARAM; EAGLE; SAINDHAV; VENKATESH; RAVITEJA{#}Karthik;teja;Mass;Akkineni Nagarjuna;Venkatesh;mahesh babu;Industry;trivikram srinivas;Blockbuster hit;Chitram;Ravi;ravi teja;Makar Sakranti;Cinema;IndiaWed, 16 Oct 2024 09:16:00 GMT- చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్..
- నాగార్జున మహేష్ బాబులనే పక్కకు నెట్టిన తేజ సజ్జా..
- 2024 సంక్రాంతి బరిలో హనుమాన్ బ్లాక్ బస్టర్..

 సినిమా ఇండస్ట్రీలో ఏ చిత్రం ఎప్పుడు ఎలాంటి హిట్ కొడుతుందో చెప్పలేం.. ఒక్కోసారి భారీ బడ్జెట్ తో సినిమాలు వచ్చి  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకాదరణ పొంది ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తాయి. అలా 2024 సంక్రాంతి బరిలో గెలిచినటువంటి పెద్ద స్టార్లను పక్కకు నెట్టేసి అతిపెద్ద హిట్టు అందుకున్నారు కుర్ర హీరో. హనుమాన్ తో సంక్రాంతి బరిలో అద్భుతమైన హిట్ సాధించారని చెప్పవచ్చు. మరి ఆ సినిమా ఎలాంటి హిట్ సాధించింది మిగతా సినిమాల కంటే ఎంత కలెక్షన్ చేసింది అని వివరాలు చూద్దాం..

2024 సంక్రాంతి సూపర్ హిట్స్ :
సంక్రాంతి అంటే కోడి పందాలు, భోగిమంటలు, రంగురంగుల ముగ్గులతో  కలకల లాడుతూ ఉంటుంది. అలాంటి సంక్రాంతి సీజన్ వ్యాల్యూ  సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్లకి,నిర్మాతలకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి 2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బరిలో నిలిచాయి. సంక్రాంతి బరిలో మొదటగా నిలిచిన చిత్రం గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం  ఓ మోస్తారు హిట్ సాధించింది. అంతేకాకుండా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చినటువంటి ఈగల్ చిత్రం  కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వచ్చింది. అంతేకాకుండా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మరో చిత్రం హనుమాన్. మొత్తం 11 భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి అన్ని సినిమాలను పక్కకు నెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాగార్జున హీరోగా ఊర మాస్ కథాంశం తో వచ్చిన చిత్రం నా సామి రంగా.  ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచి ఓ మోస్తారు హిట్ సాధించింది. 

ఇక భారీ అంచనాలతో వచ్చిన వెంకటేష్ సైంధవ్ వ మూవీ డిజాస్టర్ అయింది.ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే చాలా స్పెషల్ మూవీ గా తెరకెక్కింది.అయితే ఈ మూవీ వెంకటేష్ 75 సినిమా కావడంతో ఈ సినిమాకి ప్రమోషన్ భారీ ఎత్తున నిర్వహించారు. అంతేకాకుండా వెంకటేష్ 75సినీ ఉత్సవాన్ని కూడా నిర్వహించి ఎంతోమంది సినీ ప్రముఖులను ఆహ్వానించారు  అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఈ విధంగా 2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో  తేజ సజ్జా హీరోగా చేసినటువంటి హనుమాన్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచిందని చెప్పవచ్చు. ఓవైపు స్టార్ హీరోలైనటువంటి రవితేజ,నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబులను పక్కకు నెట్టి  ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2020 సంక్రాంతి : ఆ ఇద్దరి మధ్య గట్టి పోటీ.. చివరికి గెలిచింది అతనే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>