Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhasb703a8bc-5ed1-479c-9bf4-0877a9cd6a95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhasb703a8bc-5ed1-479c-9bf4-0877a9cd6a95-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం మొదలవుతుంది.. తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన పండుగ కావడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.. అయితే పండుగ సీజన్ కావడంతో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు పండుగ సీజన్ వరకు కలెక్షన్స్ లో ఎటువంటి దోకానే ఉండదు.. అయితే రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలో భారీగా ప్రేక్షకాదారణ పొందిన సినిమానే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ కి మన స్టార్ హీరోలు పోటీ పడుతూనే వున్న#prabhas{#}Trisha Krishnan;kodi ramakrishna;ms raju;Varsham;Remake;mani sharma;Traffic police;Simhadri;Chiranjeevi;festival;producer;Producer;Telugu;Prabhas;Darsakudu;Audience;Director;January;Blockbuster hit;Tamil;India;Tollywood;Winner;NTR;Makar Sakranti;Balakrishna;Hero;Cinema‘వర్షం’ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్.. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడుగా..!!‘వర్షం’ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్.. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడుగా..!!#prabhas{#}Trisha Krishnan;kodi ramakrishna;ms raju;Varsham;Remake;mani sharma;Traffic police;Simhadri;Chiranjeevi;festival;producer;Producer;Telugu;Prabhas;Darsakudu;Audience;Director;January;Blockbuster hit;Tamil;India;Tollywood;Winner;NTR;Makar Sakranti;Balakrishna;Hero;CinemaWed, 16 Oct 2024 08:20:07 GMT


* 2004 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి ఎంతో ప్రత్యేకం

* బాలయ్య, చిరంజీవి పోటీలో వున్నా బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్

* ప్రభాస్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ సంక్రాంతికే రిలీజ్ కావడం విశేషం..



టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు పండుగ వాతావరణం మొదలవుతుంది.. తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన పండుగ కావడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.. అయితే పండుగ సీజన్ కావడంతో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు పండుగ సీజన్ వరకు కలెక్షన్స్ లో ఎటువంటి డోకానే ఉండదు.. అయితే రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలో భారీగా ప్రేక్షకాదారణ పొందిన సినిమానే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ కి మన స్టార్ హీరోలు పోటీ పడుతూనే వున్నారు.. 2004 సంక్రాంతి సీజన్  కి  మాత్రం ఎంతో ప్రత్యేకత వుంది.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా భావించే ఎన్టీఆర్, ప్రభాస్ అప్పుడు యంగ్ హీరోలు…టాప్ హీరోలు అయిన బాలయ్య, చిరంజీవి సినిమాలతో పోటీ పడి గెలవడం ఎంతో ఆసక్తి కలిగించింది.. సింహాద్రి సినిమాతో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత పూరిజగన్నాధ్ డైరెక్షన్ లో “ ఆంధ్రవాలా “ సినిమాలో నటించాడు.. ఆ సినిమా 2004 జనవరి 1 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.. పాటలు బాగున్నా ఎన్టీఆర్ పాత్ర సెట్ కాకపోవడంతో సినిమా ప్లాప్ అయింది.. ఇక అసలైన సంక్రాంతి సీజన్ కి ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడ్డారు..జనవరి 14 2004 న ప్రభాస్ నటించిన ‘వర్షం ‘ సినిమా రిలీజ్ అయింది.. టాప్ ప్రొడ్యూసర్ “ ఎమ్ ఎస్ రాజు ‘’ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ప్రభాస్ కెరీర్ లో వర్షం సినిమా మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో త్రిష గ్లామర్, గోపీచంద్ విలనిజం ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి..


ఇక అదే రోజు వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ‘లక్ష్మి నరసింహ’ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా విక్రమ్ నటించిన తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సామి’ కి రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినా సరే పవర్ ఫుల్ డైలాగ్స్ తో దర్శకుడు జయంత్ సి పరాంజి అద్భుతంగా తెరకెక్కించారు.. మణిశర్మ మ్యూజిక్ ఎంతో హైలైట్ గా నిలిచింది. ఇక సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయి మరో స్టార్ హీరో మూవీ ‘అంజి’.. మెగాస్టార్ చిరంజీవి, కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కింది.. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్ పరంగా అద్భుతంగా వున్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది..దీనితో 2004 సంక్రాంతి సీజన్ విన్నర్ గా ప్రభాస్ నిలిచాడు.. వర్షం సినిమాతో ప్రభాస్ అద్భుత విజయం అందుకున్నాడు…







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2024: స్టార్స్ అయిన మహేష్, నాగ్ లకే చుక్కలు చూపించిన కుర్ర హీరో..హనుమాన్ తో అద్భుతం.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>