Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss7d99152b-abfc-4b8c-b26c-64a70ede60f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss7d99152b-abfc-4b8c-b26c-64a70ede60f5-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇక్కడ సీజన్ 8 విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్ల కంటే తాజా సీజన్ ఎక్కువ TRP రేటింగుతో దూసుకుపోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అవును, గత సీజన్లలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే పంచిన కొందరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి దించిన సంగతి తెలిసిందే. దాంతో హౌస్‌కి కలొచ్చింది. వాస్తవానికి ఇపుడు జనానికి బిగ్‌బాస్ షో మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ ఎవరాBigg Boss{#}seetha;Reality Show;Akkineni Nagarjuna;Winner;Bigboss;Telugu;Houseబిగ్ బాస్ విన్నర్ అతడే.. ప్రేక్షకులే కాదు.. నాగార్జున కూడా ఫిక్స్ అయ్యాడట?బిగ్ బాస్ విన్నర్ అతడే.. ప్రేక్షకులే కాదు.. నాగార్జున కూడా ఫిక్స్ అయ్యాడట?Bigg Boss{#}seetha;Reality Show;Akkineni Nagarjuna;Winner;Bigboss;Telugu;HouseWed, 16 Oct 2024 15:15:00 GMTబుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇక్కడ సీజన్ 8 విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్ల కంటే తాజా సీజన్ ఎక్కువ TRP రేటింగుతో దూసుకుపోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అవును, గత సీజన్లలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే పంచిన కొందరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి దించిన సంగతి తెలిసిందే. దాంతో హౌస్‌కి కలొచ్చింది. వాస్తవానికి ఇపుడు జనానికి బిగ్‌బాస్ షో మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ ఎవరా? అనే అంశం మీద జనాలు చర్చలు పెట్టడం ఆరంభించారు.

ఇక బిగ్ బాస్ గేమ్ విషయానికొస్తే, మొదట్లో కామ్ గోయింగ్ అనిపించిన నబీల్ మెల్ల మెల్లగా తనను తాను ముందుకి పుష్ చేసుకుంటూ చాలా బాగా ఆడడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో టాస్కుల్లో మంచి పనితనం కనబరచడంతో పాటుగా హౌస్ మేట్స్ మధ్య మంచి పాజిటివిటీ సంపాదించుకున్నాడు. అలాగే వీక్షకులు కూడా నబీల్‌నే ఈ సారి సీజన్ విన్నర్ అవుతాడని ఫిక్స్ అయిపోయారు కూడా. అంతేకాదండోయ్, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సీత కూడా ఇదే కోరుకోవడం విశేషం.

ఇక అందరినీ మించి హోస్ట్ నాగార్జున దృష్టిలో కూడా నబీల్‌ ఉండడం కొసమెరుపు. నాగార్జున కొన్ని కొన్ని సందర్భాలలో నబీల్ ని ఉద్దేశించి మంచి పాజిటివ్ గా మారడం తెలిసిందే. సో, ఎలా చూసుకున్నా.. ఈ సారి బిగ్‌బాస్ కప్పు గెలుచుకునేది నబీలే అని అందరూ అనుకుంటున్నారు. అయితే, బిగ్‌బాస్‌ ఆటలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మంచిగా ఆడుతున్నారు అనుకున్నవాళ్లు చెడుగా ప్రమోట్ కావచ్చు. చెత్తగా ఆడుతున్నారు అనుకున్నవాళ్లు మంచి వాళ్లుగానూ మారిపోవచ్చు. ఏది ఏమైనా నబీల్ ప్రస్తుతం అయితే అందరి కళ్ళల్లో ఉన్నాడు అనేది వాస్తవం. మరి ఈ తీరు చివరి వరకూ ఇలాగే కొనసాగుతుందా? లేక మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా? అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ నబీల్ ఈసారి కప్పు కొట్టే తీరుతాడు అని ఓ వర్గం వారు మాత్రం బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఒకవేళ, మీరు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ చూస్తున్నట్టయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>