PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7b7fa23e-9203-49b1-829b-dd3852a8f479-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7b7fa23e-9203-49b1-829b-dd3852a8f479-415x250-IndiaHerald.jpgమరి కొందరు నేతలు సైలెంట్ అయిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మరో నాలుగేళ్ల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉన్న ఎంపీలు సైతం తమ ఎంపీ పదవులతో పాటు.. వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు అంటే.. జగన్ పై వారికి ఏమాత్రం నమ్మకం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి వారిలో విశాఖపట్నం మాజీ ఎంపీ ముళ్ళపూడి సత్యనారాయణ ఒకరు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని 2019, 2024 ఎన్నికల వరకు విశాఖ ఎంపీగా ఉన్నారు. ycp{#}Kamma;Velagapudi;Telugu Desam Party;East;Rajya Sabha;MP;CBN;YCP;TDP;Hanu Raghavapudi;Jagan;Vishakapatnamజ‌గ‌న్‌కు దూరంగా వైసీపీ క‌మ్మ నేత‌.. గుడ్ బై చెప్పిన‌ట్టేనా..!జ‌గ‌న్‌కు దూరంగా వైసీపీ క‌మ్మ నేత‌.. గుడ్ బై చెప్పిన‌ట్టేనా..!ycp{#}Kamma;Velagapudi;Telugu Desam Party;East;Rajya Sabha;MP;CBN;YCP;TDP;Hanu Raghavapudi;Jagan;VishakapatnamWed, 16 Oct 2024 07:32:00 GMTఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయాక చాలామందికి కీలక నేతలు వరుసపెట్టి బయటికి వచ్చేస్తున్నారు. మరి కొందరు నేతలు సైలెంట్ అయిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మరో నాలుగేళ్ల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉన్న ఎంపీలు సైతం తమ ఎంపీ పదవులతో పాటు.. వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు అంటే.. జగన్ పై వారికి ఏమాత్రం నమ్మకం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి వారిలో విశాఖపట్నం మాజీ ఎంపీ ముళ్ళపూడి సత్యనారాయణ ఒకరు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని 2019, 2024 ఎన్నికల వరకు విశాఖ ఎంపీగా ఉన్నారు.


ప్రస్తుత విశాఖ టీడీపీ ఎంపి భ‌ర‌త్‌పై కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు ఎంవీవీ పట్టుబట్టి త‌ను విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో.. జగన్ విశాఖ తూర్పు సీటును ఆయనకే కేటాయించారు. వాస్తవానికి తూర్పు నియోజకవర్గంలో బీసీలలో.. బలమైన యాదవులు ఎక్కువగా ఉన్నారు. ఆ సీటును యాదవులకు ఇవ్వాల్సి ఉన్నా.. సత్యనారాయణ పట్టు పట్టడం.. అటు తెలుగుదేశం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు పోటీలో ఉండడంతో.. అదే సామాజిక వర్గం నుంచి సత్యనారాయణ పోటీ చేశారు.


ఎన్నికలలో ఓడిపోయిన సత్యనారాయణ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అసలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం.. కొంతమంది నేతలను టార్గెట్ చేసింది. మాజీ ఎంపీ విషయంలోనూ విశాఖకు చెందిన కూటమి నేతలు పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీతో అంటకాగటం కంటే.. దూరం దూరంగా ఉండటమే బెటర్ అని సత్యనారాయణ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా సత్యనారాయణ జగన్‌కు ఇప్పటికే చెప్పినట్టు టాక్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'BB4 : అఖండ' తాండవం.. టైటిల్ తోనే హైప్ పెంచేసిన బాలయ్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>