Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood64cfb709-8004-4c41-ab77-e77ec527873b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood64cfb709-8004-4c41-ab77-e77ec527873b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.. గ్లోబల్ వైడ్ గా తమ మార్కెట్ పెంచుకోవడం కోసం హీరోలు తెగ కష్టపడుతున్నారు.. ప్రతి లాంగ్వేజ్ లో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు.. ప్రతి ఇండస్ట్రీ లో తెలుగు సినిమా బాగా ఆడాలని మన హీరోలు అన్ని ఇండస్ట్రీ లో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్నారు..దీనితో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ సినిమాను శాసిస్తుంది.. తెలుగు సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.. రాజమౌళి తో మ#tollywood{#}vegetable market;Indian;Rajamouli;maya;Industry;Telugu;Audience;Hero;India;Tollywood;Heroine;Cinemaటాలీవుడ్ : హీరోయిన్ తో సామాన్య ప్రేక్షకుడికి ఎర.. తీరా చూస్తే..?టాలీవుడ్ : హీరోయిన్ తో సామాన్య ప్రేక్షకుడికి ఎర.. తీరా చూస్తే..?#tollywood{#}vegetable market;Indian;Rajamouli;maya;Industry;Telugu;Audience;Hero;India;Tollywood;Heroine;CinemaTue, 15 Oct 2024 09:39:12 GMT* పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ దర్శకులు
 
* మితిమీరిన హీరో ఎలివేషన్స్

 
* హీరోయిన్ వుంది అంటే వుంది అంతే.. అంతా ప్రేక్షకులను మాయ చేసేందుకే..

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.. గ్లోబల్ వైడ్ గా తమ మార్కెట్ పెంచుకోవడం కోసం హీరోలు తెగ కష్టపడుతున్నారు.. ప్రతి లాంగ్వేజ్ లో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు.. ప్రతి ఇండస్ట్రీ లో తెలుగు సినిమా బాగా ఆడాలని మన హీరోలు అన్ని ఇండస్ట్రీ లో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్నారు..దీనితో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ సినిమాను శాసిస్తుంది.. తెలుగు సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.. రాజమౌళి తో మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం ప్రతి సినిమా విషయంలో జరుగుతుంది.. కానీ అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు వుంది టాలీవుడ్ దర్శకుల పరిస్థితి.. పేరుకే పాన్ ఇండియా సినిమా కథ మొత్తం పాత చింతకాయ పచ్చడిలా వుంది.. పాత కథకు కొత్త పూత పూసి మార్కెట్ లో సేల్ చేస్తున్నారు.. ప్రేక్షకులు కూడా అలాంటి కథలకు మొదట్లో చూపించిన ఇంట్రెస్ట్ రాను రాను తగ్గించేస్తున్నారు.. దీనితో థియేటర్స్ ఖాళీగా మారాయి..


సినిమాలో హీరోని బేస్చేసుకొని మాత్రమే కథ రాస్తున్నారు.. అందుకే ఎక్కడ లేని హీరో ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు సినిమాలోనే కనిపిస్తుంది..సినిమాలో హీరోయిన్ పాత్ర వుంది అంటే వుంది అంతే.. హీరోయిన్ ని కేవలం గ్లామర్ కోసం అనవసరంగా ఇరికించినట్లు ఉంటుంది. సందర్భం లేని పాటల కోసం హీరోయిన్స్ ని ఎరగా వాడుకుంటున్నారు..సినిమాలో ఏం లేకపోయినా హీరోయిన్ అందాలు చూసి అయినా జనాలు థియేటర్స్ కి వస్తారని దర్శకులు భ్రమ పడుతున్నారు.. దీనితో హీరోయిన్స్ తో మితి మీరిన ఎక్స్పోజింగ్ చేయిస్తున్నారు.. అయినా కూడా అవి సినిమాని బతికించలేకపోతున్నాయి.. సినిమా విజయం సాదించాలంటే కథ బాగుండాలనే సంగతి మన దర్శకులు ఎప్పటికీ తెలుసుకుంటారో చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారు.. టాలీవుడ్ నిర్మాత సంచ‌ల‌నం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>