MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood6ec6a520-34c7-448d-aeec-1d4214ad8f04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood6ec6a520-34c7-448d-aeec-1d4214ad8f04-415x250-IndiaHerald.jpg(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా బెన్ఫిట్ షో చూడాలంటే సగటు ప్రేక్షకుడికి జేబులో నుండి రెండు లేదా మూడు రోజుల వేతనం తీయాల్సిందే.కనీసం ఆ వారంలో చూడాలని అనుకున్న ఒక రోజు వేతనం దాని కోసం కేటాయించాల్సిందే. ఇక ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటే జేబుకు చిల్లి పడాల్సిందేనా అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే టికెట్ పై భారీగా డబ్బులు పెట్టి ఏదో కాలక్షేపం కోసం సినిమాకు పోయిన విరామ సమయంలో లభించే అల్పాహారం సాటి సామాన్య ప్రేక్షక కుటుంబానికి తీరని భాధ#tollywood{#}Chilli;netizens;prema;Event;Love;Fashion;Telugu;cinema theater;Audience;Hero;Director;Cinema;mediaటాలీవుడ్: అభిమానులపై ప్రేమ ఉత్త మాటలే..అసలు మ్యాటర్ డబ్బులే.?టాలీవుడ్: అభిమానులపై ప్రేమ ఉత్త మాటలే..అసలు మ్యాటర్ డబ్బులే.?#tollywood{#}Chilli;netizens;prema;Event;Love;Fashion;Telugu;cinema theater;Audience;Hero;Director;Cinema;mediaTue, 15 Oct 2024 08:06:00 GMT(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా బెన్ఫిట్ షో  చూడాలంటే సగటు ప్రేక్షకుడికి జేబులో నుండి రెండు లేదా మూడు రోజుల వేతనం తీయాల్సిందే.కనీసం ఆ వారంలో చూడాలని అనుకున్న ఒక రోజు వేతనం దాని కోసం కేటాయించాల్సిందే. ఇక ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటే జేబుకు చిల్లి పడాల్సిందేనా అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే టికెట్ పై భారీగా డబ్బులు పెట్టి ఏదో కాలక్షేపం కోసం సినిమాకు పోయిన విరామ సమయంలో లభించే అల్పాహారం సాటి సామాన్య ప్రేక్షక కుటుంబానికి తీరని భాధ మిగులుస్తుంది.అయితే టికెట్ భారీగా పెరగడానికి కారణం సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడమే. సినిమా కోసం పెట్టిన ఖర్చు కంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ లపై పెట్టె ఖర్చే 70% అవుతుంది.అయితే అంత భారీగా ఖర్చించే నిర్మాతకి తిరిగి అదంతా రాబట్టాలంటే టికెట్ రేట్లు పెంచడం తప్ప ఇంకో మార్గం కనిపించడం లేదు.

అయితే సగటు ప్రేక్షకుడు తన అభిమాన హీరోను మొదటిరోజే చూడాలనే ఆ తపనతో భారీగా రేట్లు పెట్టి మరి సినిమా చూస్తాడు అనే నమ్మకంతోనే టికెట్ రేట్లు ఆకాశాన్నంటుకుంటున్నాయి. సినిమా విడుదలకి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరోను చూడాలనే ఆరాటంతో భారీగా ఎంట్రీ టికెట్ కొని మరి వెళ్తారు.హీరోల ప్రసంగం పూర్తి అయ్యాక చివర్లో అభిమానులను ఉద్దేశించి చెప్పే ఆ ఒక్క మాట వారిలో తమ అభిమాన నటుడిపై ఇంకా ఇష్టాన్ని పెంచుతుంది.కానీ అలా స్టార్ హీరో చెప్పిన మాట ఏదో ఏమరపాటుగా లేదా ఊతపదంగా చెప్పాడన్న సంగతి సగటు అభిమాని గ్రహించాడు.అభిమానులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడే హీరో మాత్రం బయట వాళ్ళని లెక్కచేయకుండా ఉండడం చాలా సార్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా చుసినవే. సోషల్ మీడియా ద్వారా అభిమానులు కలిసే హీరోలు వాళ్ళ గూర్చి ఆలోచించే వాళ్ళు కేవలం గుర్తింపు కోసమే గాని వారిపై ప్రేమ అనేది గాల్లో మాటలే అనేది వాస్తవం అనేది పబ్లిక్ టాక్.

ప్రీ రిలీజ్ అలాగే సినిమా సక్సెస్ ఈవెంట్స్ లో ప్రసంగం చేసే హీరోలు మాత్రం అభిమానులంటే మాకు ప్రాణం అని చెప్పడం ప్రస్తుతం ఒక ఫ్యాషన్ అయింది. కానీ వారి ప్రేమ వెనకాల అస్సలు మ్యాటర్ అంత డబ్బుల్లోనే ఉంది. అయితే అభిమానులపై అంత ప్రేమ ఉంటే టికెట్ రేట్లు తగ్గించమని అడగాలి. ఒకవేళ వారు కనుక అలా అడిగితె నిర్మాతలు నిర్మొహమాటంగా వారి రెమ్యూనరేషన్ గూర్చి మాట్లాడతరానికి వాళ్ళ భయం.ఏదేమైన తమ అభిమాన నటుడి సినిమా కోసం వేలు ఖర్చు పెట్టిమరి మొదటి రోజు థియేటర్ వైపుకి పరుగులు పెడుతున్నాడు. ఫ్యాన్స్లో అలాంటి తపన ఉన్నతకాలం స్టార్స్ స్టార్స్ లాగే ఉండి అభిమానులు జేబులకి చిల్లు పెట్టడం ఖాయం అని నెటిజన్స్ భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్ : జక్కన్నను చూసి వాతలు పెట్టుకున్న ఇండస్ట్రీ.. భారీ నష్టాల లెక్కలివే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>