MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara-movie19211deb-cd33-42cb-8100-849bd1bb4729-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara-movie19211deb-cd33-42cb-8100-849bd1bb4729-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలలో.. జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను కొంత మంది తొక్కేసే ప్రయత్నం చేసినా కూడా... నిలబడ్డాడు. నందమూరి కుటుంబం సపోర్ట్ లేకపోయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. devara movie{#}F2;Bahubali;Telangana;koratala siva;Andhra Pradesh;Blockbuster hit;Tollywood;NTR;Jr NTR;bollywood;Janhvi Kapoor;Sridevi Kapoor;Heroine;Hero;Success;Cinema;september;Teluguఎన్టీఆరా మజాకా...బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టిన దేవర ?ఎన్టీఆరా మజాకా...బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టిన దేవర ?devara movie{#}F2;Bahubali;Telangana;koratala siva;Andhra Pradesh;Blockbuster hit;Tollywood;NTR;Jr NTR;bollywood;Janhvi Kapoor;Sridevi Kapoor;Heroine;Hero;Success;Cinema;september;TeluguMon, 14 Oct 2024 07:26:00 GMTజూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలలో.. జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను కొంత మంది తొక్కేసే ప్రయత్నం చేసినా కూడా... నిలబడ్డాడు. నందమూరి కుటుంబం సపోర్ట్ లేకపోయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.


అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో 27వ తేదీన దేవర సినిమా రిలీజ్ అయి సక్సెస్ అందుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. కలెక్షన్ల పరంగా అదరగొట్టింది జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా. కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో... దేవర సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.


ఈ సినిమాలో...  జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా ఇందులో... హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వి కపూర్ కు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.  అయితే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన దేవర సినిమా ఇప్పటివరకు 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం 16 రోజుల్లోనే ఈ రికార్డును చేరుకుంది దేవర సినిమా.


 అంతేకాదు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మరో రికార్డు సృష్టించింది.  హీరో ప్రభాస్ సినిమాను బీట్ చేసి మొదటి స్థానంలో నిలిచింది దేవర. బాహుబలి 2 సినిమా కలెక్షన్లను క్రాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో 16 వ రోజున కలెక్షన్ల షేర్ లో బాహుబలి రెండవ భాగం... 3.55 కోట్లతో అగ్రస్థానంలో మొదటి నటి వరకు ఉండేది. అయితే ఆ రికార్డు ను దేవర చెరిపేసింది. 16వ రోజున 3.65 కోట్లు వసూలు చేయగలిగింది దేవర సినిమా. ఈ జాబితాలో హనుమాన్, ఆర్ ఆర్ ఆర్, ఎఫ్2 సినిమా కూడా ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దసరా ను షేక్ చేసిన బాలకృష్ణ మ్యానియా !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>