Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-66da17c8-601c-48f1-b752-f6ed635e6bb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-66da17c8-601c-48f1-b752-f6ed635e6bb9-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ అటు తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నామినేషన్లు ఆదివారం ఎలిమినేషన్లు జరగడం సర్వసాధారణంగా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. అయితే బిగ్బాస్ ఎంటర్టైన్మెంట్ చప్పగా సాగుతుంది అంటూ విమర్శలు రావడంతో.. గత సీజన్లో అలరించిన ఎంతో మంది మాజీ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే బిగ్bigboss {#}teja;monday;Iron;seetha;sunday;Bigboss;Telugu;Houseబిగ్ బాస్ : ఐరన్ లెగ్ తేజ.. ఎవ్వరిని నామినేట్ చేస్తే వారు ఔట్?బిగ్ బాస్ : ఐరన్ లెగ్ తేజ.. ఎవ్వరిని నామినేట్ చేస్తే వారు ఔట్?bigboss {#}teja;monday;Iron;seetha;sunday;Bigboss;Telugu;HouseMon, 14 Oct 2024 15:25:00 GMTప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ అటు తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నామినేషన్లు ఆదివారం ఎలిమినేషన్లు జరగడం సర్వసాధారణంగా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. అయితే బిగ్బాస్ ఎంటర్టైన్మెంట్ చప్పగా సాగుతుంది అంటూ విమర్శలు రావడంతో.. గత సీజన్లో అలరించిన ఎంతో మంది మాజీ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు నిర్వాహకులు.


 ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఆట మరోసారి రంజుగా మారిపోయింది. అయితే ఇటీవలే వారంలో కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వడంతో టేస్టీ తేజ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. గత సీజన్లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చిన తేజ ఎవరిని నామినేట్ చేస్తే వారు నేరుగా ఎలిమినేట్ అయిపోతూ వచ్చారు. గతంలో చెత్త కారణాలు చెప్పి తేజ నామినేట్ చేయడం.. అతను నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఇక ఆ వారమే బయటికి వెళ్లిపోవడం జరిగింది.


 దీంతో టేస్టీ తేజ ఐరన్ లెగ్ అంటూ అందరూ బయట ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో కూడా చెత్త కారణంతో సీతను నామినేట్ చేశాడు టేస్టీ తేజ. నిద్రపోతున్న తన మీద నాలుగు చుక్కల నీళ్ళు జిలకరించింది అంటూ అటు సీతని నామినేట్ చేశాడు చివరికి తేజ చేత నామినేట్ చేయబడిన సీత హౌస్ నుంచి వెళ్ళిపోయింది. దీంతో టేస్టీ తేజ సీజన్ మారాడు కానీ ఐరన్ లెగ్ మాత్రం మారలేదు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. గత సీజన్లో తేజ దెబ్బకి ఎంతోమంది బలయ్యారు. ఇక ఇప్పుడు సీజన్ 8 లో తేజా దెబ్బకి బలైన మొదటి కంటెస్టెంట్ సీత అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న నారా రోహిత్.. కానీ ఎక్కడ చెడిందంటే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>