MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi28566cac-afcc-4f5f-84cb-85d5e8871fc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi28566cac-afcc-4f5f-84cb-85d5e8871fc0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక మెట్టు పైన ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చి... ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో స్టార్ హీరో గానే కాకుండా సామాజికవేత్త అలాగే రాజకీయ నాయకుడిగా కూడా చిరంజీవి రాణించడం జరిగింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లు ఒకే హీరోయిన్తో ఏకంగా 19 సినిమాలు చేయడం జరిగింది. chiranjeevi{#}Chiranjeevi;Vijayashanti;Traffic police;Gang Leader;Pasivadi Pranam;Industry;Hero;Congress;Heroine;News;Tollywood;Cinemaచిరంజీవి: ఒకటి కాదు..రెండు కాదు ఒకే హీరోయిన్‌ తో 19 సినిమాలు ?చిరంజీవి: ఒకటి కాదు..రెండు కాదు ఒకే హీరోయిన్‌ తో 19 సినిమాలు ?chiranjeevi{#}Chiranjeevi;Vijayashanti;Traffic police;Gang Leader;Pasivadi Pranam;Industry;Hero;Congress;Heroine;News;Tollywood;CinemaMon, 14 Oct 2024 09:12:00 GMT* టాలీవుడ్‌ లో సక్సెస్‌ జోడిగా పేరు
* ప్రతి సినిమాలో చిరంజీవి-విజయశాంతి డ్యాన్స్‌ హైలేట్‌
* సంఘర్షణ సినిమాతో ప్రారంభమై..మెకానిక్‌ అల్లుడితో ముగింపు
* విశ్వంభర ఆఫర్‌ రిజెక్ట్‌ చేసిన విజయశాంతి



టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక మెట్టు పైన ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చి... ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో స్టార్ హీరో గానే కాకుండా సామాజికవేత్త అలాగే రాజకీయ నాయకుడిగా కూడా చిరంజీవి రాణించడం జరిగింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లు ఒకే హీరోయిన్తో ఏకంగా 19 సినిమాలు చేయడం జరిగింది.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత,అలనాటి హీరోయిన్ విజయశాంతితో... మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 19 సినిమాలు చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో 19 సినిమాలు రాగా...  అందులో 90% హీట్లు కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి అలాగే విజయశాంతి దాదాపు 20 సంవత్సరాల పాటు... సినిమా ఇండస్ట్రీ ని ఏలినట్లు చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో...  పసివాడి ప్రాణం మంచి కలెక్షన్లను రాబట్టింది.

అలాగే యముడికి మొగుడు,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అలాగే గ్యాంగ్ లీడర్ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లను కూడా...  చిరంజీవి అలాగే విజయశాంతి ఇండస్ట్రీకి అందించడం జరిగింది.  విజయశాంతి మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో.. సంఘర్షణ అనే మొదటి సినిమా వచ్చింది. ఆ తర్వాత దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, చాలెంజ్, చిరంజీవి లాంటి సినిమాలు చేశారు.

అనంతరం కొండవీటి రాజా,  ధైర్యవంతుడు, చాణక్యసపదం, స్వయంకృషి, మంచి దొంగ, యుద్ధభూమి,  రుద్రనేత, కొండవీటి దొంగ, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్ అలాగే మెకానిక్ అల్లుడు లాంటి సినిమాలు... వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అలాగే వీరి సినిమాలో ఇద్దరి డాన్స్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచేవి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో.. ఈ మధ్యకాలంలో మరో సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. విశ్వంబర  సినిమాలో విజయశాంతిని ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం అడిగారట. కానీ దాన్ని విజయశాంతి రిజెక్ట్ చేసినట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాయి పల్లవి తో ఆ సీన్ చేయడం ఇష్టం లేక..ఆ బ్లాక్ బస్టర్ మూవీనే క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>