Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----aef3f11c-b312-46e0-8b2b-c28ae9c63fbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----aef3f11c-b312-46e0-8b2b-c28ae9c63fbe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు చేస్తున్న సినిమాలకు అటు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సినీ ప్రేక్షకులు అందరూ కూడా టాలీవుడ్ హీరోల సినిమాలను చూసేందుకు తెగ ఆసక్తిని కనపరిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెరగడానికి కారణమైన సినిమా ఏది అంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా అని చెప్పాలి. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా రాజమౌళి తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఇండస్ట్రీ బాహుబలి{#}deva;Fidaa;Audience;Industries;Bahubali;Rajamouli;Telugu;Tollywood;Industry;Cinemaబాహుబలి 2 లో ఇది గమనించారా.. అప్పట్లో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు?బాహుబలి 2 లో ఇది గమనించారా.. అప్పట్లో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు?బాహుబలి{#}deva;Fidaa;Audience;Industries;Bahubali;Rajamouli;Telugu;Tollywood;Industry;CinemaMon, 14 Oct 2024 14:12:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు చేస్తున్న సినిమాలకు అటు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సినీ ప్రేక్షకులు అందరూ కూడా టాలీవుడ్ హీరోల సినిమాలను చూసేందుకు తెగ ఆసక్తిని కనపరిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెరగడానికి కారణమైన సినిమా ఏది అంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా అని చెప్పాలి. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా రాజమౌళి తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా..  ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది.


 ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ రెండు సినిమాలు కూడా కళాఖండాలు లాంటివి అనడంలో సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని కూడా మాట్లాడుకోవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా హిట్టు కొట్టింది. అయితే అటు బాహుబలి సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీలో ఈ మూవీ వస్తుంది అంటే చాలు ఇక టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు ప్రేక్షకులు.  రాజమౌళి టేకింగ్ కి అందరూ ఫిదా అయిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఏ సీన్ తెరకెక్కించాలి అనే విషయంపై ఫుల్ క్లారిటీతో ఉంటారు రాజమౌళి.



 చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో అర్థం వచ్చేలా రూపొందించడంలో.. రాజమౌళికి మించిన వారు లేరు. అచ్చం ఇలాగే బాహుబలి 2 సినిమాలో అంతర్లీనంగా దాగి ఉన్న ఎన్నో విశేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయని చెప్పాలి. ఈ మూవీలో అమరేంద్ర బాహుబలిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తుంది శివగామి. అంతేకాదు బల్లాల దేవుడిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి సిద్ధమవుతుంది. అయితే పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో సింహాసనానికి ఎదురుగా ఎంతో మంది రాజులు మంత్రులు కుంటాల రాజ్యం నుంచి వచ్చిన వారు కూడా ఆసీనులై ఉంటారు.

 కుడి వైపు కూర్చున్న వారి ఆసనాలపై రక్షణగా గోడ లాంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ ఎడమవైపు కూర్చున్న వారికి మాత్రం అలాంటివేమీ లేకపోవడం గమనించవచ్చు. కుడి వైపున మాహిష్మతి రాజ్యానికి చెందిన వారు కూర్చుని ఉండగా.. ఎడమవైపున దేవ సేన రాజ్యం అంటే ఎడమ వైపు దేవసేన కుంటల రాజ్యానికి చెందినవారు ఆశీస్సులు ఉంటారు. అయితే ఇక ఈ సీన్ ద్వారా బల్లాల దేవుడి పక్షపాత వైఖరిని చూపించాలని జక్కన్న ప్లాన్ వేశాడట. సినిమా చూస్తున్న ప్రేక్షకులు పెద్దగా ఇది పట్టించుకోకపోయినప్పటికీ.. ఇక ఇప్పుడు ఈ సన్నివేశం వెనుక దాగి ఉన్న రాజమౌళి ఆలోచన గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగా రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే కామెంట్లు చేస్తూ ఉన్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాక్: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>