MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-movie-that-sunil-missed-as-the-hero-in-trivikram-s-direction2a90849c-4304-4898-895e-2510261c5b5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-movie-that-sunil-missed-as-the-hero-in-trivikram-s-direction2a90849c-4304-4898-895e-2510261c5b5d-415x250-IndiaHerald.jpgఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్.. ప్రస్తుతం బన్నీతో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఉంటుందన్న చర్చలు కూడా నడుస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సునీల్, త్రివిక్రమ్ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరిది భీమవరం దగ్గర ఉన్న కాళ్ల ప్రాంతం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే రూంలో చాలా రోజులు ఉన్నారు. Trivikram {#}Comedian;Bhimavaram;trivikram srinivas;mahesh babu;sunil;Success;Tollywood;Chiranjeevi;India;Cinemaత్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సునీల్ హీరోగా మిస్ అయిన సినిమా ఇదే...?త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సునీల్ హీరోగా మిస్ అయిన సినిమా ఇదే...?Trivikram {#}Comedian;Bhimavaram;trivikram srinivas;mahesh babu;sunil;Success;Tollywood;Chiranjeevi;India;CinemaSun, 13 Oct 2024 12:51:08 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్‌లలో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరుకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్.. ప్రస్తుతం బన్నీతో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఉంటుందన్న చర్చలు కూడా నడుస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సునీల్, త్రివిక్రమ్ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరిది భీమవరం దగ్గర ఉన్న కాళ్ల ప్రాంతం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే రూంలో చాలా రోజులు ఉన్నారు.


హైదరాబాదులో పంజాగుట్టలో ఇద్దరు సినిమా ప్రయత్నాలు చేస్తూ ఒకే గదిలో ఉండేవారు. త్రివిక్రమ్ ట్యూష‌న్లు క‌థ‌లు చెపుతూ రచయితగా ప్రయత్నాలు చేస్తుండేవారు. ఇక సునీల్ నటుడు అవ్వాలని ఇండస్ట్రీలోనూ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో మాటలు రచ‌యితగా ఇంట్రీ ఇచ్చారు. అదే సినిమాలో సునీల్‌కి మంచి రోల్‌ రాశాడు త్రివిక్రమ్. రచయితగా ఇప్పటివరకు త్రివిక్రమ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే సునీల్ కూడా నటుడుగా మంచి లైఫ్ లీడ్‌ చేస్తున్నాడు. ఒక దశలో సునీల్ లేకుండా సినిమా ఉండేదే కాదు.


చిరంజీవి సైతం ప్రత్యేకంగా తన సినిమాలో సునీల్ పాత్ర ఉండాలని సలహా ఇచ్చారు అంటే.. సునీల్ డెడికేష‌న్ అప్పట్లో ఎలా ఉండేదో తెలుస్తోంది. సునీల్ కమెడియన్గా మంచి పాపులర్ అయ్యాక.. హీరోగా కూడా మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ బంతి అనే టైటిల్‌తో సునీల్‌ని పెట్టి హీరోగా సినిమా చేయాలని అనుకున్నాడు. సునీల్‌తో ఈ మాట ఎన్నోసార్లు చెప్పాడు. సునీల్ కి వరుసగా ప్లాపులు వచ్చి హీరోగా అవకాశాలు తగ్గిపోయిన‌ టైంలో త్రివిక్రమ్ వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ సునీల్‌కి ఇచ్చిన సినిమా చేయ లేకపోయాడు. అలా సునీల్ - త్రివిక్రమ్ కాంబినేషన్ బంతి సినిమా ఆగిపోయింది. అయితే తన సినిమాలో మాత్రం ఏదో ఒక పాత్ర రాస్తూ సునీల్ కి మళ్ళీ లైఫ్ ఇస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చెక్కు చెదరని అందంతో అభిమానులను కట్టిపడేస్తున్న మిస్ వరల్డ్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>