MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishvam3ed8ff8c-643c-46c8-ba0d-f8c0630740f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishvam3ed8ff8c-643c-46c8-ba0d-f8c0630740f9-415x250-IndiaHerald.jpgఓ బ్రాండ్ ఉంది. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, దూకుడు ఇవన్నీ సరైన మార్క్ సినిమాలు. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే.. ఎక్కడి నుంచి చూసిన రిమోట్ అవసరం ఉండదు. ప్రతి సీను చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అందులో కామెడీ బిట్లు ఎన్నిసార్లు చూసినా నవ్వుతూనే ఉంటాం. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల ఫామ్ లో లేడు. వరుస ఫ్లాపులతో కెరీర్ లో పూర్తిగా వెనకబడిపోయాడు. Vishvam{#}Badshah;amar;srinu vytla;Dubai;Ee Rojullo;Dookudu;Ravi;ravi teja;Train;Comedy;Hero;Tollywood;Cinemaసూప‌ర్ హిట్ అవ్వాల్సిన ' విశ్వం ' సినిమా శ్రీను వైట్ల చేసిన ఆ మిస్టేక్‌తోనే ఢాం అయ్యిందా...?సూప‌ర్ హిట్ అవ్వాల్సిన ' విశ్వం ' సినిమా శ్రీను వైట్ల చేసిన ఆ మిస్టేక్‌తోనే ఢాం అయ్యిందా...?Vishvam{#}Badshah;amar;srinu vytla;Dubai;Ee Rojullo;Dookudu;Ravi;ravi teja;Train;Comedy;Hero;Tollywood;CinemaSun, 13 Oct 2024 13:55:11 GMTశ్రీను వైట్ల అంటేనే టాలీవుడ్ లో ఒక మార్క్ ఉంది. ఓ బ్రాండ్ ఉంది. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, దూకుడు ఇవన్నీ సరైన మార్క్ సినిమాలు. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే.. ఎక్కడి నుంచి చూసిన రిమోట్ అవసరం ఉండదు. ప్రతి సీను చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అందులో కామెడీ బిట్లు ఎన్నిసార్లు చూసినా నవ్వుతూనే ఉంటాం. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల ఫామ్ లో లేడు. వరుస ఫ్లాపులతో కెరీర్ లో పూర్తిగా వెనకబడిపోయాడు.


ఎప్పుడో 2018లో రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత మళ్లీ శ్రీను వైట్ల నుంచి సినిమా రాలేదు. అటు హీరో గోపీచంద్ కూడా వ‌రుస‌ పెట్టి డిజాస్టర్లు ఇస్తున్నాడు. ఈ టైంలో వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన విశ్వం సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని.. ఇద్దరికీ సూపర్ హిట్ ఇస్తుందని అందరూ నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ.. సినిమా చూస్తే శ్రీను వైట్ల చేసిన ఒక మిస్టేక్ వల్ల సూపర్ హిట్ అవ్వాల్సిన రెస్పాన్స్.. సినిమా బిలో యావరేజ్ కు ఫ్లాప్‌కు మధ్య కొట్టుమిట్టాడుతుంది.


రెడీ, దూకుడు, బాద్షా లాంటి తన పాత సినిమాలలో హీరో పక్క క్యారెక్టర్లకు ఏదో ఒక కథ చెప్పి బకరాలను చేసి తన మిషన్‌కు వాడుకుంటూ ఉంటాడు. విశ్వం సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు. గొప్పగా చెప్పుకున్న ట్రైన్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. సినిమా మొత్తం చూసేక శ్రీనువైట్ల మరోసారి కథ‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. ఈ రోజుల్లో రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు ఎవరూ చూడటం లేదు. అలాంటి కథలు చెప్పాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ బలంగా రాసుకొని చేయాలి. ఆ విషయంలో శ్రీను వైట్ల పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. తన పాత సినిమాలను కాపీ కొట్టి అటూ.. ఇటూ.. మిక్చర్ పొట్లం చేసి విశ్వం సినిమాను తీసేశాడు. ఫలితంగా విశ్వం సినిమా అంచనాలలో కనీసం 20 శాతం కూడా అందుకోలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చెక్కు చెదరని అందంతో అభిమానులను కట్టిపడేస్తున్న మిస్ వరల్డ్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>