PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/chandrababunaidub4a73303-ae50-44fb-9794-ebfbe83871d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/chandrababunaidub4a73303-ae50-44fb-9794-ebfbe83871d2-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త కార్డుల మంజూరుకు అర్హతల ను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది. నూతన దంపతులకు కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అదే సమయంలో వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డుల మంజూరు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్​న్యూస్ చెప్పింది. అర్హులైన పేదలకు త్వరలో నూతన రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉనchandrababunaidu{#}YCP;central government;Cabinet;Andhra Pradesh;Governmentఏపీ: రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ తో ఆదేశాలు జారీ చేయనున్న ప్రభుత్వం.?ఏపీ: రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ తో ఆదేశాలు జారీ చేయనున్న ప్రభుత్వం.?chandrababunaidu{#}YCP;central government;Cabinet;Andhra Pradesh;GovernmentSat, 12 Oct 2024 22:30:00 GMTఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త కార్డుల మంజూరుకు అర్హతల ను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది. నూతన దంపతులకు కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అదే సమయంలో వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డుల మంజూరు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన పేదలకు త్వరలో నూతన రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది.ఈ మేరకు వైఎస్సార్సీపీ సర్కార్ చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే తొలి విడతగా రూ.1000 కోట్లు, తర్వాత రెండో విడతగా రూ.674.40 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటిలో 89 లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటీ 48లక్షల 43వేల 671 రేషన్ కార్డులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 89 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద నిత్యావసర సరుకులను అందిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 59,43,671 రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు మెుత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు...ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా వాహనాల ద్వారా రేషన్‌ సరకుల పంపిణీపై సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. 6000ల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4,000 పైగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000లు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000లకు మించితే, ఆ కుటుంబాలు రేషన్‌ కార్డుకు అర్హులు కావని గత సర్కార్ నిర్ణయించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దయ్యాయి. వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయి. తమకు వచ్చేదే తక్కువ జీతమని, రేషన్‌ కార్డుల తొలగింపు వల్ల నష్టపోతున్నామని వారంతా ఆవేదనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వమైనా కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా కార్డులు జారీ చేయాలని వారు కోరుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ తో ఆదేశాలు జారీ చేయనున్న ప్రభుత్వం.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>