ViralFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/friendship-for-snake-cowaf04a822-eb11-40c0-a69d-6f48144c673d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/friendship-for-snake-cowaf04a822-eb11-40c0-a69d-6f48144c673d-415x250-IndiaHerald.jpgమనుషుల్లో రోజు రోజుకు స్వార్ధం పెరిగిపోతు..శతృత్వాలను పెంచుకుంటుంటే జంతువులు, విషసర్పాలు మాత్రం తమ జాతి వైరాన్ని మర్చిపోయి కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి. జాతి వైరాన్ని మరిచిన జంతువుల వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటాం. అటువంటివి చూస్తుంటే మనుషులే సిగ్గు పడాల్సిన పరిస్థితి. కానీ సాధు జంతువులైనా, క్రూర మృగాలైనా, విషసర్పాలైనా తమకు హాని కలుగుతుంది అంటేనే దాడి చేస్తాయి.లేదంటే వాటి మానాన అవి జీవిస్తుంటాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని లక్షల రీల్స్, వీడియోలు వస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోfriendship for snake cow{#}Cow slaughter;prema;media;Loveవైరల్: ఆవు పెట్టే ముద్దులకి ఎంజాయ్ చేస్తున్న పాము..చూస్తే అవకావ్వాల్సిందే.!వైరల్: ఆవు పెట్టే ముద్దులకి ఎంజాయ్ చేస్తున్న పాము..చూస్తే అవకావ్వాల్సిందే.!friendship for snake cow{#}Cow slaughter;prema;media;LoveSat, 12 Oct 2024 14:30:00 GMTమనుషుల్లో రోజు రోజుకు స్వార్ధం పెరిగిపోతు..శతృత్వాలను పెంచుకుంటుంటే జంతువులు, విషసర్పాలు మాత్రం తమ జాతి వైరాన్ని మర్చిపోయి కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి. జాతి వైరాన్ని మరిచిన జంతువుల వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటాం. అటువంటివి చూస్తుంటే మనుషులే సిగ్గు పడాల్సిన పరిస్థితి. కానీ సాధు జంతువులైనా, క్రూర మృగాలైనా, విషసర్పాలైనా తమకు హాని కలుగుతుంది అంటేనే దాడి చేస్తాయి.లేదంటే వాటి మానాన అవి జీవిస్తుంటాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని లక్షల రీల్స్, వీడియోలు వస్తుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆకర్షిస్తాయి. అసలు ఎక్కడా చూడని వింతలు-విశేషాలు.. సోషల్ మీడియా చూపిస్తోంది. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఈ వీడియో ఒకటి.సాధారణంగా పాము అంటేనే విషజంతువు. దానిని చూస్తే.. ఆమడదూరం పారిపోవాల్సిందే. జస్ట్ ఇలా కాటేస్తే.. అలా ప్రాణం పోతుంది. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు పాము ముందుగానే.. పడగవిప్పి బుసలు కొడుతూ భయపెడుతుంది. ప్రాణానికి ముప్పు ఉందని తెలిస్తే అస్సలు వదిలి పెట్టదు. అంతటి విషాన్ని నిలువెల్లా కలిగి ఉన్న పాముల్లో కూడా కొన్ని మంచి పాములుంటాయని ఇలాంటి వీడియోలు చూస్తే అనిపించకమానదు. 

 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలావుండగా ఆవులు చూసేందుకు ఎంత శాంతంగా కనిపిస్తాయో.. వాటి ప్రవర్త కూడా అదేవిధంగా ఉంటుంది. పైగా ఆవు ఇంట్లో ఉంటే శుభం అని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే ఆవు కనిపిస్తే చాలు ఎవరైనా దైవంగా చూస్తారు. అలాగే పాము అంటే ఎవరికైనా ఒళ్లు కంపనం పుడుతుంది. అది కనిపిస్తే ఎలాంటి వారైనా దూరంగా పారిపోతారు. ఇప్పుడీ రెండింటి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆవు, పాము స్నేహం చేస్తే ఎలా ఉంటుంది. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పొలంలో గడ్డి మేస్తున్న ఆవుకు ఉన్నట్టుండి ఓ నాగు పాము కనిపించింది. దాన్ని చూడగానే దూరంగా పారిపోవాల్సిన ఆవు  అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. చిన్న నాటి తన మిత్రుడు కనిపించినట్లుగా పడగ విప్పిన పాముకు ముద్దులు పెడుతూ  తన ప్రేమంతా కురిపించింది.ఈ నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలను చూసి ఆనందించడమే కానీ, వివరించడం కష్టం అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రేమ ద్వారా లభించిన నమ్మకం” అని రాశారు. పలువురు వినియోగదారులు పోస్ట్‌పై ఆసక్తికరమైన కామెంట్‌లు చేశారు.కాగా పాముకాటుతో మనుషులేకాదు పశువులు కూడా చనిపోతున్నాయి. కానీ ఈ వీడియో మాత్రం పాము, గోమాతల మధ్య ప్రేమానురాగాలను ప్రతిబింభిస్తోంది. ఇది నిజంగా అపురూపమే అని చెప్పితీరాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కెరీర్ లోనే చుక్కలు చూపించిన స్టార్ దర్శకులు వీరే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>