MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-b-gopalaff91c76-50b2-47e2-86c3-266e5ac87877-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-b-gopalaff91c76-50b2-47e2-86c3-266e5ac87877-415x250-IndiaHerald.jpgరాజ్ తరుణ్ భలే ఉన్నాడు సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర లో న‌టించారు. రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ - కొరటాల శివ దేవర సినిమా లో కూడా హీరోయిన్ జాన్వీ కపూర్ కి తల్లి పాత్ర చేసింది. ఓ రకంగా దేవర లో హీరోయిన్ జాన్వీ కపూర్ కంటే.. మణిచందననే ఎక్కువగా కనిపిస్తుంద‌ని చెప్పాలి. అయితే ఆమె పాత్ర డైలాగులు ఎక్కువుగా లేవు. Balayya B Gopal{#}Balakrishna;Telugu;Tollywood;Heroine;India;koratala siva;Cinemaబాల‌య్య - బి.గోపాల్ సోషియో ఫాంట‌సీ మూవీ... హీరోయిన్ ఎవ‌రంటే...!బాల‌య్య - బి.గోపాల్ సోషియో ఫాంట‌సీ మూవీ... హీరోయిన్ ఎవ‌రంటే...!Balayya B Gopal{#}Balakrishna;Telugu;Tollywood;Heroine;India;koratala siva;CinemaFri, 11 Oct 2024 11:00:35 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ మణిచందన తెలుగు ప్రేక్షకులకి ప్రేక్షకులకి సుపరిచితమే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఆమె న‌టిస్తున్నారు. ఈ ఏడాది మణిచందన చాలా సినిమాల్లో కనిపించారు. రవితే మిస్టర్ బచ్చన్ లో ప్రభావతి అనే రోల్ చేశారు. రాజ్ తరుణ్ భలే ఉన్నాడు  సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర లో న‌టించారు. రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ - కొరటాల శివ  దేవర సినిమా లో కూడా హీరోయిన్ జాన్వీ కపూర్ కి తల్లి పాత్ర చేసింది. ఓ రకంగా దేవర లో హీరోయిన్ జాన్వీ కపూర్ కంటే.. మణిచందననే ఎక్కువగా కనిపిస్తుంద‌ని చెప్పాలి. అయితే ఆమె పాత్ర డైలాగులు ఎక్కువుగా లేవు.


ఇదిలా ఉంటే మణిచందన గతంలో హీరోయిన్ గా రవితేజ వంటి హీరోల సరసన చేసింది. మనసిచ్చాను సినిమాలో రవితేజకి హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సుమన్ ప‌క్క‌న కూడా ఆమె హీరోయిన్ గా చేసింది. తమిళంలో, కన్నడంలో కూడా మ‌ణిచంద‌న హీరోయిన్ గా కొన్ని సినిమాల‌లో న‌టించింది. ఒకానొక టైంలో బాలకృష్ణ సరసన ఈమె సోలో హీరోయిన్ చేసే ఛాన్స్ కూడా కొట్టిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మణిచందన ఈ విషయం చెప్ప‌డంతో అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది. గతంలో బాలకృష్ణ – మణిచందన హీరో, హీరోయిన్లుగా ఓ సోసియో ఫాంటసీ స్టార్ట్ చేశార‌ట‌.


సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉందట. ఒకటి, రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది.. అయితే అనూహ్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయినట్టు ఆమె చెప్పుకొచ్చింది. పలు మ్యాగ్జైన్లలో ఈమె బాలకృష్ణతో ఉన్న స్టిల్స్ కూడా పబ్లిష్ అయ్యాయన్న విష‌యం కూడా మ‌ణిచంద‌న స్వ‌యంగా చెప్పింది. ఒక వేళ బాల‌య్య‌తో ఆమె సినిమా చేసి ఉంటే.. ఆమె కెరీర్ మ‌రో ట‌ర్న్ అయ్యేదేమో.. ! ఇక ప్రస్తుతం మణిచందన అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వేలకోట్ల ఆస్తులు ఉన్న రతన్ టాటా.. ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>