PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradeshbdc3825b-5646-4e87-9306-53aff793551f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradeshbdc3825b-5646-4e87-9306-53aff793551f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ముందువరసలో ఉందని ఇప్పటికే చాలా సందర్బాల్లో చర్చ జరిగింది. అయితే అప్పుల్లో కూడా ఆంధ్రులు టాప్ లో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి లక్ష మందిలో 60093 మందిపై అప్పుల భారం ఉందని కేంద్రం తాజాగా రిలీజ్ చేసిన సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. andhrapradesh{#}Survey;June;Newsఅప్పుల్లో అగ్రస్థానంలో ఆంధ్రులు.. ప్రతి లక్షమందిలో అంతమందిపై అప్పుల భారం!అప్పుల్లో అగ్రస్థానంలో ఆంధ్రులు.. ప్రతి లక్షమందిలో అంతమందిపై అప్పుల భారం!andhrapradesh{#}Survey;June;NewsFri, 11 Oct 2024 10:09:00 GMTఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ముందువరసలో ఉందని ఇప్పటికే చాలా సందర్బాల్లో చర్చ జరిగింది. అయితే అప్పుల్లో కూడా ఆంధ్రులు టాప్ లో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి లక్ష మందిలో 60093 మందిపై అప్పుల భారం ఉందని కేంద్రం తాజాగా రిలీజ్ చేసిన సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది.
 
అప్పులు తీసుకున్న వారిలో పట్టణవాసులతో పోల్చి చూస్తే గ్రామీణవాసులే 4.3 శాతం అధికంగా ఉన్నారని సమాచారం అందుతోంది. పట్టణ మహిళలతో పోల్చి చూస్తే గ్రామీణ మహిళలలో అప్పులు ఉన్నవారు 32.86 శాతంగా ఉండగా పురుషులలో ఈ సంఖ్య 1.56 శాతంగా ఉందని తెలుస్తోంది. అప్పులు ఉన్న పట్టణ మహిళలతో పోల్చి చూస్తే పురుషుల సంఖ్య 21.69 శాతం అధికంగా ఉండగా గ్రామీణ ప్రాంతాలలో పురుషులతో పోలిస్తే మహిళలు 7.49 శాతం ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
 
దేశంలో ఉన్న 29 రాష్ట్రలలో ఏ రాష్ట్రంలో కూడా అప్పుల్లో మహిళల సంఖ్య పురుషులను మించి లేదని సమాచారం అందుతోంది. జాతీయ సగటు లక్ష మందిలో 18322 కాగా రాష్ట్రంలో అందుకు మూడు రెట్లు ఎక్కువ ఉందని తెలుస్తోంది. 2022 జులై నెల నుంచి 2023 జూన్ మధ్య ఈ సర్వే నిర్వహించే సమయానికి 500 రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకొని చెల్లించని వారందరినీ రుణ గ్రహీతల కింద పరిగణనలోకి తీసుకున్నారు.
 
నార్త్ ప్రజలతో పోల్చి చూస్తే సౌత్ లోని వారిపైనే రుణ భారం ఎక్కువగా ఉందని సమాచారం అందుతోంది. యూపీలో ప్రతి లక్ష మందిలో 11844 మందికి అప్పులు ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడా ఈ సంఖ్య ప్రతి లక్ష మందిలో 20 వేలను మించలేదు. సౌత్ లో మాత్రం ప్రతి రాష్ట్రంలో ఈ సంఖ్య 30000 కంటే ఎక్కువగా ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాల‌య్య - బి.గోపాల్ సోషియో ఫాంట‌సీ మూవీ... హీరోయిన్ ఎవ‌రంటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>