MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-divya-bharti3f6acab2-9499-4687-9a40-2c822876a3da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-divya-bharti3f6acab2-9499-4687-9a40-2c822876a3da-415x250-IndiaHerald.jpgవాసు లాంటి డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను మోహ‌న్ బాబు సొంతం చేసుకున్నారు. అలా తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించగా ... పరుచూరి సోదరులు మాటలు అందించారు. కెవి మహదేవన్ సంగీతం అందించారు. సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అసెంబ్లీ రౌడీ సినిమాను నిర్మించారు. Divya Bharti{#}mahadevan;mohan babu;Chittoor;Divya Bhatnagar;editor mohan;Husband;Industry;Assembly;District;sree;Audience;king;King;producer;Producer;Heroine;Reddy;CBN;Tamil;Cinema' దివ్య భారతి ' పై మోజుప‌డి సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత‌..!' దివ్య భారతి ' పై మోజుప‌డి సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత‌..!Divya Bharti{#}mahadevan;mohan babu;Chittoor;Divya Bhatnagar;editor mohan;Husband;Industry;Assembly;District;sree;Audience;king;King;producer;Producer;Heroine;Reddy;CBN;Tamil;CinemaFri, 11 Oct 2024 14:15:00 GMTటాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నిర్మాతగా మంచి ఫాంలో ఉన్నప్పుడు అనేక సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఈ క్ర‌మంలోనే త‌మిళంలో పి. వాసు లాంటి డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను మోహ‌న్ బాబు సొంతం చేసుకున్నారు. అలా తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించగా ... పరుచూరి సోదరులు మాటలు అందించారు. కెవి మహదేవన్ సంగీతం అందించారు. సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అసెంబ్లీ రౌడీ సినిమాను నిర్మించారు.


ఇక చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయిన శ్రీకాళహస్తీలో తీసిన అందమైన వెన్నెలలోనా పాటకే మోహన్ బాబు చాలా ఖర్చు చేశారట. ఈ పాట‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు ప‌ట్ట‌ణానికి చెందిన ర‌స‌రాజు ర‌చించారు. ఇక అప్ప‌ట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అయింది. ఆ వెంట‌నే మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు స్థిర‌ప‌డిపోయింది. ఇందులో హీరోయిన్ గా చేసిన దివ్య భార‌తి ని చూసి ఇటు సినీ వర్గాలు, అటు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.


దాంతో నెక్స్ట్ ఇయర్ ఇదే కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు అనే సినిమాను తెర‌కెక్కించారు.  ఇది కూడా తమిళ రీమేక్..కథ మీద అంత నమ్మకం లేక మోహన్ బాబు కాకుండా పి.శ్రీధర్ రెడ్డి ఈ చిట్టెమ్మ మొగుడు సినిమా ను నిర్మించారు. జస్ట్ నిర్మాత మాత్రమే మారాడు తప్ప మిగతా యూనిట్ సభ్యులందరూ సేం టు సేం గా ఉన్నారు. అయితే, అసెంబ్లీ రౌడీలో దివ్య భారతిని ఎంతగా ఆదరించారో చిట్టెమ్మ మొగుడులో మాత్రం దానికి భిన్నంగా వ్యతిరేకించారు మ‌న ప్రేక్ష‌కులు.. చిట్టెమ్మ గా దివ్య భారతిని చూడలేకపోయారు. ఇలా దివ్య భార‌తి కోసం సినిమా తీసి నిర్మాత నిండా మునిగిపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ ఏరియాలో దేవర కి చేదు అనుభవం.. ఏకంగా అంత నష్టం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>