MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ntr-does-something-even-prabhas-couldnt8dfb3017-6179-4e30-a471-d8bf6b1d8096-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ntr-does-something-even-prabhas-couldnt8dfb3017-6179-4e30-a471-d8bf6b1d8096-415x250-IndiaHerald.jpgదేవర1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు వరుసగా దేవర సినిమాతో ఏడో హిట్ దక్కింది. వాస్తవానికి రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో చాలామంది ఈ సినిమా రిజల్ట్ విషయంలో టెన్షన్ పడ్డారు. అయితే సినిమా విడుదలైన ఆరో రోజే దేవర1 బ్రేక్ ఈవెన్ అయ్యి అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. koratala shiva{#}Kick;NTR;koratala siva;Jr NTR;Cinemaదేవర సీక్వెల్ విషయంలో జరుగుతున్న తప్పు ఇదే.. అలా చూపిస్తే ఎలా కొరటాల?దేవర సీక్వెల్ విషయంలో జరుగుతున్న తప్పు ఇదే.. అలా చూపిస్తే ఎలా కొరటాల?koratala shiva{#}Kick;NTR;koratala siva;Jr NTR;CinemaFri, 11 Oct 2024 08:57:00 GMTదేవర1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు వరుసగా దేవర సినిమాతో ఏడో హిట్ దక్కింది. వాస్తవానికి రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో చాలామంది ఈ సినిమా రిజల్ట్ విషయంలో టెన్షన్ పడ్డారు. అయితే సినిమా విడుదలైన ఆరో రోజే దేవర1 బ్రేక్ ఈవెన్ అయ్యి అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
 
అయితే దేవర1 లో దేవర పాత్రను చంపేయడం కొరటాల శివ చేసిన పెద్ద తప్పు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర మూవీలో దేవర ఉన్న ప్రతి సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తే వర ఉన్న సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. దేవర సీక్వెల్ మొత్తం వర పాత్ర ప్రధానంగా సాగితే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి అయితే కలిగించవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
దేవర ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలు దేవర2 లో ఉన్నా ఫ్యాక్స్ కోరుకునే కిక్ మాత్రం దేవర పాత్రతోనే దొరుకుతుంది. కేవలం వర పాత్రను చూపిస్తే ఎలా కొరటాల అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు . ఆ పాత్ర చుట్టూ ఎంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసినా ఫ్యాన్స్ కు ఎక్కుతాయా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
వరను భయస్థుడిగా చూపించడమే సినిమాకు అతిపెద్ద మైనస్ అని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. దేవర విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్ల నుంచి కొరటాల శివ ఏం నేర్చుకుంటారో చూడాల్సి ఉంది. 2026లో రిలీజ్ టార్గెట్ గా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర2 సినిమాకు సంబంధించి టెక్నీషియన్లు, నిర్మాతలకు సంబంధించి కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నారా రోహిత్‌ పెళ్లి వెనుక మిస్ట్రరీ లేడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>