MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manichandana-letest-movie-news621d8da4-4c2d-4f88-906b-7e13df2589a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manichandana-letest-movie-news621d8da4-4c2d-4f88-906b-7e13df2589a8-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోయిన్ మణిచందన గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ మధ్య కాలంలో మని చందన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమె ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీmanichandana{#}harish shankar;Mister;ravi teja;b gopal;koratala siva;Janhvi Kapoor;Mass;Heroine;Interview;Balakrishna;sree;Jr NTR;Ravi;Telugu;Cinemaబాలయ్య మూవీలో సోలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది.. 2 రోజుల తర్వాత అలా జరిగింది.. దేవర నటి..!బాలయ్య మూవీలో సోలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది.. 2 రోజుల తర్వాత అలా జరిగింది.. దేవర నటి..!manichandana{#}harish shankar;Mister;ravi teja;b gopal;koratala siva;Janhvi Kapoor;Mass;Heroine;Interview;Balakrishna;sree;Jr NTR;Ravi;Telugu;CinemaThu, 10 Oct 2024 10:38:00 GMTసీనియర్ హీరోయిన్ మణిచందన గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ మధ్య కాలంలో మని చందన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమె ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మని చందన , జాన్వి కపూర్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా మణిచందన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాలో మీరు సోలో హీరోయిన్గా ఎంపిక అయ్యారట అది నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది.

దానికి మని చందన సమాధానం ఇస్తూ ... నిజమే ... కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ సోషియా ఫాంటసీ మూవీ ని మొదలు పెట్టారు. ఆ మూవీలో నేను సోలో హీరోయిన్గా ఎంపిక అయ్యాను. రెండు రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక ఎందుకో ఆ సినిమాను ఆపివేశారు. నాపై కూడా ఒక రోజు షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా రోజులు వెయిట్ చేశాను. కానీ ఆ మూవీ స్టార్ట్ కాలేదు అని మని చందన తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యావరేజ్ సినిమాలతో అద్భుతాలు.. వరుసగా ఆ మూడు సినిమాలకు అలాంటి పరిస్థితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>