MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala22045e47-fdf6-46aa-81ff-62cdbacde031-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala22045e47-fdf6-46aa-81ff-62cdbacde031-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యి మంచి కలక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు అయినటువంటి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... దేవర సినిమాలో ఆయుధ పూజా సాంగ్ అనుకున్నాం. అనిరుద్koratala{#}Sangeetha;Janhvi Kapoor;Pooja Hegde;koratala siva;NTR;Smart phone;Cinemaఆయుధ పూజ సాంగ్ విషయంలో రివర్స్ లో ప్రవర్తించిన అనిరుద్.. అందుకే అంత లేట్.. కొరటాల..!ఆయుధ పూజ సాంగ్ విషయంలో రివర్స్ లో ప్రవర్తించిన అనిరుద్.. అందుకే అంత లేట్.. కొరటాల..!koratala{#}Sangeetha;Janhvi Kapoor;Pooja Hegde;koratala siva;NTR;Smart phone;CinemaThu, 10 Oct 2024 13:38:00 GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యి మంచి కలక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు అయినటువంటి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... దేవర సినిమాలో ఆయుధ పూజా సాంగ్ అనుకున్నాం. అనిరుద్ కూడా ఓ సాంగ్ మాకు ఇచ్చాడు. అది మాకు అద్భుతంగా నచ్చింది.

ఇక దాదాపుగా ఏ సంగీత దర్శకుడితో అయినా మాకు ఈ సాంగ్ వద్దు అంటే ఆయన లేదు సార్ ... ఈ సాంగ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని కన్విన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అనిరుద్ మాత్రం ఆయుధ పూజ సాంగ్ ఇవ్వడం కోసం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆయుధ పూజ సాంగ్ కోసం అనిరుద్ ఇచ్చిన ట్యూన్ మాకు అద్భుతంగా నచ్చడంతో మేము అంతా సెట్ చేసుకొని షూటింగ్ కు వెళ్దాం అనుకున్నాం. అంతలోపు అనిరుద్ ఒక రోజు ఫోన్ చేసి షూటింగ్ ఆపేయండి సార్ అన్నాడు. ఎందుకు అంటే ... సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్.

అందులోనూ ఎంతో క్రూరమైన వ్యక్తులు అందరూ ఒకే చోట ఉంటే ఆ పాట ఎలా ఉండాలి. అది అదిరిపోయే రేంజ్ లో ఉండాలి. నేను మీకు ఇది వరకు ఇచ్చిన సాంగ్ అంత గొప్ప సాంగ్ కాదు. నేను కొంత టైమ్ తీసుకుని ఒక అద్భుతమైన సాంగ్ ను మీకు ఇస్తాను అన్నాడు. దానితో మేము కూడా ఆగాము. ఇక సినిమాను ఆ పాటతో మొదలు పెట్టాలి అనుకున్నాం. కాకపోతే అనిరుద్ ఆ సాంగ్ ఇచ్చే వరకు ఆగడంతో దానిని ఆఖరుగా ఆయుధ పూజా సాంగ్ ను షూట్ చేసాం అని కొరటాల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ టైమ్ లో స్టార్ హీరోకి షాక్ ఇచ్చిన గోపీచంద్.. బ్లాక్ బస్టర్ టాక్ తో ఆ హీరో కలెక్షన్లకు గండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>