PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap2212cead-ee0f-477d-b83c-18a89a7b8c31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap2212cead-ee0f-477d-b83c-18a89a7b8c31-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమల్లోకి తీసుకువచ్చారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు రాష్ట్రమంతటా ఫ్రీగా ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో డిసెంబర్ 9న ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఏ ఐడీ కార్డ్ చూపించకుండా మహిళలు ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. అయితే ఏదైనా ఐడీ కార్డap{#}saritha;Telangana;Revanth Reddy;RTC;Congress;bus;Assembly;Conductor;Uppal;Andhra Pradesh;December;thursdayవైరల్: తెలంగాణ బస్సులో ఆంధ్రా మహిళా హల్చల్.. ట్విస్ట్ మాములుగా లేదుగా.?వైరల్: తెలంగాణ బస్సులో ఆంధ్రా మహిళా హల్చల్.. ట్విస్ట్ మాములుగా లేదుగా.?ap{#}saritha;Telangana;Revanth Reddy;RTC;Congress;bus;Assembly;Conductor;Uppal;Andhra Pradesh;December;thursdayThu, 10 Oct 2024 22:45:00 GMTతెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమల్లోకి తీసుకువచ్చారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు రాష్ట్రమంతటా ఫ్రీగా ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో డిసెంబర్ 9న ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఏ ఐడీ కార్డ్ చూపించకుండా మహిళలు ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. అయితే ఏదైనా ఐడీ కార్డు చూపించాలని అప్పుడు కండక్టర్ జీరో టికెట్ ఇస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది.ఇది చెల్లదని టికెట్ కొనుగోలు చేయాలని కండక్టర్ చెప్పడంతో గొడవకు దిగి, కండక్టర్‌పై చేయి చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ప్రస్తుతం ఈ సంఘటన తెలిసిన మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా, సికింద్రాబాద్ వద్ద ఓ కండక్టర్ మహిళల వద్ద ఛార్జీ వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఆరుగురు మహిళలు సంగీత్ వరకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అయితే ఆధార్ కార్డు చూపించమని కండక్టర్ అడగ్గా వారు అధికారులు ఏ కార్డ్ లేకున్నా ప్రయాణించవచ్చని చెబుతుంటే మీరు కార్డు అడుగుతున్నారా అని అనగా.. కండక్టర్ కోపంతో వారికి మనిషికి రూ.10 చొప్పున టికెట్ ఇచ్చాడు. టికెట్‌కు డబ్బులు ఇవ్వం అంటే వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారు డబ్బులు చెల్లించి.. టికెట్ తీసుకుని సజ్జనార్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పి సంగీత్ వద్ద దిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటన తెలిసిన మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: తెలంగాణ బస్సులో ఆంధ్రా మహిళా హల్చల్.. ట్విస్ట్ మాములుగా లేదుగా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>