PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeh-jagan-ap-politices3d1598f2-98fa-4018-8ef9-318cf9f9fdb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeh-jagan-ap-politices3d1598f2-98fa-4018-8ef9-318cf9f9fdb6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఎంత హల్చల్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు అదే బుక్ ని అమలు చేస్తున్నారనే విధంగా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. లోకేష్ కి పోటిగా ఒక బుక్కు పెడతానంటు ప్రకటించారు.. ఇటీవలే మంగళగిరిలో వైసీపీ నేతలు కార్యకర్తలతో భేటీ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ వారందరిని పరామర్శిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉన్నామంటు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్LOKEH;JAGAN;AP;POLITICES{#}Lokesh;Jagan;Nara Lokesh;Lokesh Kanagaraj;Elections;CM;YCP;Party;Red;Manam;CBN;Reddyఏపీ: లోకేష్ రెడ్ బుక్కు మించి జగన్ కొత్త బుక్..!ఏపీ: లోకేష్ రెడ్ బుక్కు మించి జగన్ కొత్త బుక్..!LOKEH;JAGAN;AP;POLITICES{#}Lokesh;Jagan;Nara Lokesh;Lokesh Kanagaraj;Elections;CM;YCP;Party;Red;Manam;CBN;ReddyWed, 09 Oct 2024 20:32:00 GMTఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో  ఎంత హల్చల్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు అదే బుక్ ని అమలు చేస్తున్నారనే విధంగా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. లోకేష్ కి పోటిగా ఒక బుక్కు పెడతానంటు ప్రకటించారు.. ఇటీవలే మంగళగిరిలో వైసీపీ నేతలు కార్యకర్తలతో భేటీ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ వారందరిని పరామర్శిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉన్నామంటు తెలిపారు.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయని ఆ కష్టాల నుంచే నాయకుడు అనేవారు పుడతారని.. రెడ్ బుక్ పెట్టడం పెద్ద పని కాదంటూ మనం కూడా గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించే తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి.. మా నేతలు కూడా బుక్స్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.. తాము గుడ్ బుక్ పేరుతో రాసుకోవడం మొదలు పెట్టామని పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కచ్చితంగా అందులో ఉంచుతామని తెలియజేశారు.


వారికి తప్పకుండా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు అధికార దుర్వినియోగం చేస్తూ వైసిపి కార్యకర్తలను వేధిస్తున్న వారందరికీ కూడా తాను ప్రతిసారి భరోసా ఇచ్చి పార్టీకి తోడుగా ఉంటూనే అందరిలో విశ్వాసం నింపేలా చేస్తున్నామంటూ తెలిపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈసారి ఎన్నికలు వస్తే కచ్చితంగా రాబోయేది వైసిపి పార్టీని అంటూ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరితపు హామీలు.. కూటమి నేతలు చెప్పిన ఈ మాటల వల్ల చంద్రబాబు నాయుడు గెలిచారని కూడా తెలియజేశారు. గెలవకముందు ఒకలాగా గెలిచిన తర్వాత మరొక లాగా కూటమి ప్రభుతో వ్యవహరిస్తోంది అంటే ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: మహేష్ ధరించిన ఈ వెకేషన్ బ్యాగ్ ధర తెలిస్తే షాకే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>