MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgహీరో సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ అతడి కెరియర్ కు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంతవరకు అతడి నుండి రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బావగా అతడికి గుర్తింపు దక్కినప్పటికీ పెద్ద దర్శకులు అతడితో సినిమాలు తీయడానికి ఇప్పటివరకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం దసరా రేస్ లో విడుదలకాబోతున్న ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ పై చాల ఆశలు పెట్టుకుని ఆమూవీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ కోసం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఒక విషయాన్ని బయట పెRASHMIKA{#}rahul;rashmika mandanna;sudheer babu;sudigali sudheer;Dussehra;Vijayadashami;Rahul Sipligunj;Geetha Arts;Kollu Ravindra;Rajani kanth;media;Director;India;News;Cinema;Fatherరష్మికను ఫాలో అవుతున్న సుధీర్ బాబు !రష్మికను ఫాలో అవుతున్న సుధీర్ బాబు !RASHMIKA{#}rahul;rashmika mandanna;sudheer babu;sudigali sudheer;Dussehra;Vijayadashami;Rahul Sipligunj;Geetha Arts;Kollu Ravindra;Rajani kanth;media;Director;India;News;Cinema;FatherWed, 09 Oct 2024 15:54:00 GMTహీరో సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ అతడి కెరియర్ కు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంతవరకు అతడి నుండి రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బావగా అతడికి గుర్తింపు దక్కినప్పటికీ పెద్ద దర్శకులు అతడితో సినిమాలు తీయడానికి ఇప్పటివరకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం దసరా రేస్ లో విడుదలకాబోతున్న ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ పై చాల ఆశలు పెట్టుకుని ఆమూవీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.



మూవీ ప్రమోషన్ కోసం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఒక విషయాన్ని బయట పెట్టాడు. త్వరలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు. ‘అందాల రాక్షసి’ మూవీతో నటుడిగా మొదలుపెట్టి ఆతరువాత ‘చి ల సౌ’ మూవీతో దర్శకుడుగా మారి ఆపై నాగార్జునతో   ‘మన్మథుడు 2’ మూవీ తీసి ఫెయిల్యూర్ డైరెక్టర్ గా మారిన రాహుల్ ప్రస్తుతం రష్మిక తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.



‘గర్ల్ ఫ్రెండ్’ టైటిల్ తో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదలకు రెడీ కానున్నట్లు వస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తూ ఉండటంతో ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీ ఇంకా విడుదల కాకుండానే రాహుల్ సుధీర్ బాబుతో మూవీ చేయడానికి ప్రాయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.



ఇప్పుడు సుధీర్ బాబు ‘జటాధర’ అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈసినిమాను చేస్తూ సుధీర్ రాహుల్ రవీంద్ర తో సినిమాను చేస్తాడా లేదంటే ఆమూవీ పూర్తి అయిన తరువాత రాహుల్ తో సినిమా ఉంటుందా అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విగ్‌తో కనిపించిన మహేష్ బాబు..వీడియో వైరల్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>