PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-in-the-process-of-forming-government-in-jk17e283df-be78-4a50-8a2a-38b2ea378cb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-in-the-process-of-forming-government-in-jk17e283df-be78-4a50-8a2a-38b2ea378cb0-415x250-IndiaHerald.jpg2024 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ఈవీఎంల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ ఓటమిపాలు కావడం సంచలనం అయింది. ఈవీఎంలకు సంబంధించి మోసాలు జరిగాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను ప్రూవ్ చేసే విషయంలో వాళ్లు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. bjp victory{#}Jairam Ramesh;central government;Congress;Haryana;YCP;Bharatiya Janata Party;Party;Andhra Pradesh99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలుపు.. ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయా?99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలుపు.. ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయా?bjp victory{#}Jairam Ramesh;central government;Congress;Haryana;YCP;Bharatiya Janata Party;Party;Andhra PradeshWed, 09 Oct 2024 09:40:00 GMT2024 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ఈవీఎంల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ ఓటమిపాలు కావడం సంచలనం అయింది. ఈవీఎంలకు సంబంధించి మోసాలు జరిగాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను ప్రూవ్ చేసే విషయంలో వాళ్లు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.
 
అయితే హర్యానాలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ సైతం ఈవీఎంల విషయంలో ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అయింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో లోక్ తంత్ర ఓడిందని వ్యవస్థ తంత్ర అక్రమంగా గెలిచిందని కాంగ్రెస్ తెలిపింది.
 
హర్యానాలో ఊహించని ఫలితాలు రావడం కాంగ్రెస్ శ్రేణులకు షాకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఖూనీ చేస్తూ వెలువడిన ఫలితాలు ఇవి అని చెప్పుకొచ్చారు. హర్యానా ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైందని ఆయన కామెంట్లు చేశారు. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే 70 శాతం నిండిన ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచిందని జైరాం రమేశ్ తెలిపారు.
 
హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి కుట్ర దాగుందని 12 నుంచి 14 నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని మా నుంచి విజయాన్ని లాక్కున్నారని అధికార పార్టీ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని జైరాం రమేశ్ కామెంట్లు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు 50 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడంతో జైరాం రమేష్ ఈ ఆరోపణలు చేశారు. ఆరోపణలపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతి హాసన్‌ న్యూడ్‌ వీడియో వైరల్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>