EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi88925a60-5097-4b75-95a9-3abee2ec1eb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi88925a60-5097-4b75-95a9-3abee2ec1eb6-415x250-IndiaHerald.jpgగత పదేళ్లలో దేశం మొత్తంలో ఎక్కడా కూడా ప్రతి పక్షాల ప్రభుత్వాలు ప్రశాంతంగా పాలన సాగించిన పరిస్థితి లేదనే ఆరోపణలు మనం విన్నాం. ఎన్డీయేలో ఉన్న పార్టీలకు కూడా కొన్ని సందర్భాల్లో గాలి ఆడలేదు. అందుకే అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చారు. నవీన్ పట్నాయక్, కేసీఆర్ లాంటి ముఖ్య మంత్రులు బీజేపీకి ఇబ్బందులు లేకుండా పాలన చేపట్టారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఎక్కడా కూడా బీజేపీకి ఎదురు చెప్పలేదు. ఆ సాహసం కూడా చేయలేదు. కానీ ఓ ముఖ్య మంత్రి విషయంలో అంతా సౌకర్యవంతంగా ఉంది. ఏ నిర్ణయం అమలు చేయాలన్నmodi{#}KCR;Allu Aravind;bhavana;revanth;Telangana;Revanth Reddy;Governor;Manam;Jagan;Air;raj;Telangana Chief Minister;CM;Party;Bharatiya Janata Partyరేవంత్ ప్రభుత్వం జోలికి వెళ్లని మోదీ? రీజన్ ఆయనేనా?రేవంత్ ప్రభుత్వం జోలికి వెళ్లని మోదీ? రీజన్ ఆయనేనా?modi{#}KCR;Allu Aravind;bhavana;revanth;Telangana;Revanth Reddy;Governor;Manam;Jagan;Air;raj;Telangana Chief Minister;CM;Party;Bharatiya Janata PartyTue, 08 Oct 2024 09:33:00 GMTగత పదేళ్లలో దేశం మొత్తంలో ఎక్కడా కూడా ప్రతి పక్షాల ప్రభుత్వాలు ప్రశాంతంగా పాలన సాగించిన పరిస్థితి లేదనే ఆరోపణలు మనం విన్నాం. ఎన్డీయేలో ఉన్న పార్టీలకు కూడా కొన్ని సందర్భాల్లో గాలి ఆడలేదు. అందుకే అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చారు. నవీన్ పట్నాయక్, కేసీఆర్ లాంటి ముఖ్య మంత్రులు బీజేపీకి ఇబ్బందులు లేకుండా పాలన చేపట్టారు.


వైసీపీ అధినేత జగన్ కూడా ఎక్కడా కూడా బీజేపీకి ఎదురు చెప్పలేదు. ఆ సాహసం కూడా చేయలేదు. కానీ ఓ ముఖ్య మంత్రి విషయంలో అంతా సౌకర్యవంతంగా ఉంది. ఏ నిర్ణయం అమలు చేయాలన్నా సరే దానికి ఏ వైపు నుంచి అడ్డూ అదుపు ఉండటం లేదు. సీఎం హోదాలో ఆయన తీసుకునే నిర్ణయాలకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే భావన చాలామందిలో ఉంది. ఇంతకీ ఎవరా సీఎం అంటే.. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే.


ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి వచ్చిన ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీని ఏ విధంగా ఇబ్బంది పెట్టకపోయినా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోయావారు. కానీ రేవంత్ విషయంలో అంతా రివర్స్. హైడ్రా విషయానికొస్తే.. హైడ్రాకు అందరి బీజేపీ నేతల నుంచి మద్దతు లభించింది. ఆయనకు అనుకూలంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు.


హైదరాబాద్ ను కబ్జాల నుంచి కాపాడండి.. కానీ బడా బాబులవి కూడా కూల్చాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం లేదు. ధర్మపురి అరవింద్ ఎక్కడా మాట్లాడింది లేదు. రఘునందర్ రావు, బండి సంజయ్ సహా పలువురు నేతలు బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు. ఇక హైడ్రా ఆర్డినెన్స్ విషయంలోను గవర్నర్ పెద్దగా ఆలస్యం చేయలేదు. హైడ్రా ఆర్డినెన్స్ పై వెంటనే సంతకం చేసేశారు.  ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజ్ భవన్ విషయంలో సీన్ ఇలా ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్న ఆయా రాష్ట్రాల గవర్నర్లు అడ్డు చెప్పేవారు. కానీ రేవంత్ విషయంలో అంతా సాఫీగా జరిగిపోతుంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు.. ఆ కథనాల వల్ల ఇబ్బందులు తప్పవా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>