MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycpbae89cdd-9b69-43b5-a89e-b4e43b6b2416-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycpbae89cdd-9b69-43b5-a89e-b4e43b6b2416-415x250-IndiaHerald.jpgకొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చర్యలను ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజు సోషల్ మీడియాలో ఎండకడుతూ వస్తున్నారు. తిరుమలలో ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయటం.. వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినందుకు తాను ప్రాయశ్చిత్తం చేస్తానంటూ కాషాయ వస్త్రధారణలో పవన్ దీక్ష చేపట్టడం మొదలు.. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య వార్‌ నడుస్తోంది. ycp{#}king;YCP;KTR;kalyan;Tamilnadu;Prakash Raj;Telangana Chief Minister;Congress;Bharatiya Janata Party;Tamilప్ర‌కాష్‌రాజ్ ఇక ప‌క్కా వైసీపీ.. బీఆర్ఎస్ మ‌నిషే... !ప్ర‌కాష్‌రాజ్ ఇక ప‌క్కా వైసీపీ.. బీఆర్ఎస్ మ‌నిషే... !ycp{#}king;YCP;KTR;kalyan;Tamilnadu;Prakash Raj;Telangana Chief Minister;Congress;Bharatiya Janata Party;TamilTue, 08 Oct 2024 12:50:01 GMTఆంధ్రప్రదేశ్ ఉప‌ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విల‌క్షణ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చర్యలను ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజు సోషల్ మీడియాలో ఎండకడుతూ వస్తున్నారు. తిరుమలలో ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయటం.. వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినందుకు తాను ప్రాయశ్చిత్తం చేస్తానంటూ కాషాయ వస్త్రధారణలో పవన్ దీక్ష చేపట్టడం మొదలు.. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య వార్‌ నడుస్తోంది.


తన పోస్టును పవన్ కళ్యాణ్ సరిగా అర్థం చేసుకోలేదని.. మరోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని.. ప్రకాష్ రాజ్ చురకలు అంటించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. తాజాగా తమిళ మీడియాలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. పవన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. తమిళనాడు డిప్యూటీ సీఎంను వెనకేసుకొచ్చిన ప్రకాష్ రాజు.. పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫుట్‌బాల్ లాంటి వ్యక్తి.. మైదానంలో ఫుట్‌బాల్‌ని తన్నినట్టుగా ఎవరైనా తంతారు. సిగ్గు శరం లేని వ్యక్తి.. ఒక అవకాశవాది.. దేశంలో హిందువు ధర్మానికి, సనాతన ధర్మానికి ఎక్కడ ప్రమాదం పొంచి లేదు. బిజెపి మాత్రమే పొంచి ఉందని చెబుతోంది.


ఈ విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదని గట్టిగా కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ప్రకాష్‌రాజ్ పై కొద్దిరోజుగా సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తోంది. పవన్.. తెలంగాణలో ముందు నుంచి కెసిఆర్, కేటీఆర్ ను పొగుడుతూ అక్కడ బీటిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పై కూడా అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్న ప్రకాష్‌రాజ్.. వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించుకపోవడం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి.. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ స్టార్ హీరోనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>