Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2aa52002-749c-4b12-9cd8-e0558e839a0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2aa52002-749c-4b12-9cd8-e0558e839a0e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. తమ మార్కెట్ ను అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది హీరోలు సరైన హిట్టు కోసం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఎందుకో సరైన హిట్టు మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. మ్యాచో స్టారtollywood{#}Episode;Shadow;Audience;India;vegetable market;Cinemaఆ ఒక్క రీజన్ వల్లే 'భీమా' ఫ్లాప్.. షాకింగ్ విషయం చెప్పిన గోపీచంద్.ఆ ఒక్క రీజన్ వల్లే 'భీమా' ఫ్లాప్.. షాకింగ్ విషయం చెప్పిన గోపీచంద్.tollywood{#}Episode;Shadow;Audience;India;vegetable market;CinemaTue, 08 Oct 2024 16:15:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. తమ మార్కెట్ ను  అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది హీరోలు సరైన హిట్టు కోసం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఎందుకో సరైన హిట్టు మాత్రం దక్కించుకోలేకపోతున్నారు.


 అలాంటి హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. మ్యాచో స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్.. గత కొంతకాలం నుంచి సరైన హిట్టు కొట్టలేకపోతున్నాడు. వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హిట్టు మాత్రం దక్కట్లేదు. అయితే  రీసెంట్గా భారీ అంచనాల మధ్య వచ్చిన బీమా మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది.  ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇక ఇప్పుడు విశ్వం అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న గోపీచంద్.. భీమా కావడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 విశ్వం మూవీ హిట్ అవుతుందా అంటూ ప్రశ్నించగా.  నమ్మకం లేకపోతే జీవితంలో ముందడుగు వేయలేము అంటూ చెప్పాడు. ఇక బీమా మూవీ గురించి మాట్లాడుతూ.. నేను దానిని నమ్మాను. కానీ అందులో ఒక చిన్న ఎపిసోడ్ తేడా కొట్టిందని మాకు తెలుసు. మిగతాది బాగున్నప్పటికీ అది వర్కౌట్ కాకుండా ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాకు ఓవర్ షాడో చేసింది. అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని మీకు ముందే తెలుసా అంటూ ప్రశ్నకి.. ఆ ఒక్క ఎపిసోడ్ బాగాలేదు అన్న విషయం మాకు ముందే తెలుసు అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. ఇక రామబాణం రిజల్ట్ కూడా ముందే తెలుసు. కానీ ఏమీ చేయలేం. అయిపోయింది అది అంతే అంటూ గతంలో తన సినిమాలు విషయంలో జరిగిన మిస్టేక్స్ ని గుర్తు చేసుకున్నాడు గోపిచంద్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ రాజకీయాల్లోకి జనసేన.. ? పవన్ ప్లానింగ్ ఇదేనా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>