EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanthe5f2ac67-b006-439f-a2c4-fd311100602e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanthe5f2ac67-b006-439f-a2c4-fd311100602e-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. పదేళ్ల తర్వాత పార్టీకి అధికారంలోకి తెచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన చెరువులు ఆక్రమణల తొలగింపు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు. అక్రమణల తొలగింపు కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇక మూసీ ప్రక్షాలన కోసం మూసీ శివార్లలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలు, మూసీ ఆక్రమణల తొలగింపుతో ప్రబుత్వంపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా సీఎం రేవంత్revanth{#}Revanth Reddy;vegetable market;Hyderabad;media;CM;Party;Congress;Reddy;Andhra Pradeshరేవంత్ చేసిన పనికి రియల్టర్లు ఏపీ తరలిపోతున్నారా?రేవంత్ చేసిన పనికి రియల్టర్లు ఏపీ తరలిపోతున్నారా?revanth{#}Revanth Reddy;vegetable market;Hyderabad;media;CM;Party;Congress;Reddy;Andhra PradeshTue, 08 Oct 2024 09:26:00 GMTతెలంగాణలో కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. పదేళ్ల తర్వాత పార్టీకి అధికారంలోకి తెచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన చెరువులు ఆక్రమణల తొలగింపు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు. అక్రమణల తొలగింపు కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు.


ఇక మూసీ ప్రక్షాలన కోసం మూసీ శివార్లలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలు, మూసీ ఆక్రమణల తొలగింపుతో ప్రబుత్వంపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదే లే అంటున్నారు. ఆరు నూరైనా హైడ్రా ఆగదని తెగేసి చెబుతున్నారు. ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. ఆర్డినెన్స్ తెచ్చారు. చట్టం చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే కొంతమంది, కొన్ని మీడియా సంస్థలు హైడ్రా కారణంగా హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం కుదలైందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ఆరోపిస్తున్నారు.


దీంతో పాటు రియల్టర్లు ఏపీ తరలి వెళ్తున్నారు అని కూడా వార్తా కథనాలు వెలువరిస్తున్నాయి. అయితే వాస్తవంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. అయితే ఇది మన రాష్ట్రంలోనే కాదు . దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం, ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు రియల్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.


అయితే ఈ మందగమనం తాత్కాలికమే అని.. త్వరలోనే స్థిరాస్తి రంగం పుంజుకుంటుంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో రియాలటీ పునాదులు బలంగా ఉన్నాయని, సెంటిమెంట్ మాత్రమే బలహీనంగా ఉందని చెబుతున్నారు. ప్రతికూల మార్కెట్ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడులు పెట్టడం లేదని చెబుతున్నారు. తేలికైన పెట్టుబడులతో ప్రస్తుత పరిస్థితిని సువర్ణావకాశాలుగా మలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కు మౌలిక వసతుల పరంగా ఎన్నో సానుకూలత అంశాలు ఉన్నాయి. కొత్తగా మరికొన్ని రాబోతున్నాయి. ఫలితంగా నగరం నలుదిక్కులా విస్తరించడం ఖాయం. ఇవన్నీ భవిష్యత్తు అనుకూలతల్నీ మార్కెట్ నిపుణులు అంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు.. ఆ కథనాల వల్ల ఇబ్బందులు తప్పవా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>