MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodee7ae711-5783-4ebd-851a-2e7823d0670a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodee7ae711-5783-4ebd-851a-2e7823d0670a-415x250-IndiaHerald.jpgడైనమిక్ హీరో అడివి శేష్, హీరోయిన్ శృతి హాసన్ కాంబినేషన్‍లో సినిమా ప్రకటన రాగానే ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి నెలకొంది. శేష్ఎక్స్‌శృతి అంటూ ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ వచ్చింది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. షానియెల్ దేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ లవ్, యాక్షన్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ‘డెకాయిట్’ అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి టైటిల్ టీజర్ కూడా రిలీజ్ అయింది. జూలియెట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అనే డైలాగ్‍లో అడివి శేష్ tollywood{#}Shruti;Shruti Haasan;sruthi;Supriya;Chitram;Love;News;Hero;Manam;Heroine;Cinemaఅడవి శేష్ డెకాయిట్ నుండి తప్పుకున్న శృతిహాసన్.. ఎందుకంటే..!?అడవి శేష్ డెకాయిట్ నుండి తప్పుకున్న శృతిహాసన్.. ఎందుకంటే..!?tollywood{#}Shruti;Shruti Haasan;sruthi;Supriya;Chitram;Love;News;Hero;Manam;Heroine;CinemaTue, 08 Oct 2024 13:50:00 GMTడైనమిక్ హీరో అడివి శేష్, హీరోయిన్ శృతి హాసన్ కాంబినేషన్‍లో సినిమా ప్రకటన రాగానే ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి నెలకొంది. శేష్ఎక్స్‌శృతి  అంటూ ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ వచ్చింది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. షానియెల్ దేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ లవ్, యాక్షన్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ‘డెకాయిట్’ అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి  టైటిల్ టీజర్ కూడా రిలీజ్ అయింది. జూలియెట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అనే డైలాగ్‍లో అడివి శేష్ ఎంట్రీ.. ఈ డెకాయిట్ టైటిల్ టీజర్లో ఉంది.

అల్లర్లు జరిగిన ప్రాంతంలో తుపాకీ పట్టుకొని శృతి హాసన్ కనిపిస్తారు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకొని విడిపోయారనేలా డైలాగ్స్ ఉన్నాయి. శేష్, శృతి ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు ఎక్కు పెట్టుకుంటారు. తుపాకీ ఫైర్ చేసినట్టు, కింద పడినట్టు బ్యాక్‍గ్రౌండ్ సౌండ్ కూడా ఉంది.  ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి  శృతిహాసన్ తప్పుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో అడివి శేష్, శృతిహాసన్ వరుస దోపిడీలకు పాల్పడుతూ

 ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని కూడా టీం చెప్పుకొచ్చింది. దీనికి తోడు వచ్చే ఏడాది ఈ సినిమాతో పాటు మరో కొత్త మూడు సినిమాలు కూడా విడుదల చేస్తానని అడివి శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>