MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/emraan-hashmi-injore-movie-shotting0de7dc17-70e0-45b8-a8bd-7af33886c748-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/emraan-hashmi-injore-movie-shotting0de7dc17-70e0-45b8-a8bd-7af33886c748-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈ మధ్యకాలంలో అన్ని భాషలలో నటించడానికి మక్కువ చూపుతున్నారు. అలా చూపుతున్న వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి కూడా ఒకరు.. ఈమధ్య వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయారు. ఇటీవల హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్ సమయంలో పలు రకాల యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. అడవి శేషు నటిస్తున్న గూడచారి-2 చిత్రంలో ఇమ్రాన్ హస్మి చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్లో భాగంగా ఇమ్రాన్ హస్మి స్టంట్ చేస్తూ ఉన్న సమయంలో ఒక EMRAAN HASHMI;INJORE;MOVIE;SHOTTING{#}Murder;kalyan;Murder.;Tollywood;Telugu;India;Success;Chitram;bollywood;Cinemaఓజీ విలన్ కు ప్రమాదం.. ఆందోళనల ఫ్యాన్స్..!ఓజీ విలన్ కు ప్రమాదం.. ఆందోళనల ఫ్యాన్స్..!EMRAAN HASHMI;INJORE;MOVIE;SHOTTING{#}Murder;kalyan;Murder.;Tollywood;Telugu;India;Success;Chitram;bollywood;CinemaTue, 08 Oct 2024 08:02:00 GMTబాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈ మధ్యకాలంలో అన్ని భాషలలో నటించడానికి మక్కువ చూపుతున్నారు. అలా చూపుతున్న వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి కూడా ఒకరు.. ఈమధ్య వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయారు. ఇటీవల హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్ సమయంలో పలు రకాల యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. అడవి శేషు నటిస్తున్న గూడచారి-2 చిత్రంలో ఇమ్రాన్ హస్మి చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.



సినిమా షూటింగ్ సెట్లో భాగంగా ఇమ్రాన్ హస్మి స్టంట్ చేస్తూ ఉన్న సమయంలో ఒక ప్రమాదం జరిగిందని దీనివల్ల అతనికి గాయాలయ్యాయని సమాచారం. ఇమ్రాన్ హస్మి ఒక యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఒక చోటు నుంచి మరొక చోటుకు దూసుకుపోతున్న సమయంలో తన మెడకు గాయమైనట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇమ్రాన్ హస్మి మెడకు గాయమైనట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ మరికొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ హస్మి పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఆందోళన పడిన.. ఆ తర్వాత  ఆరోగ్యంగా ఉండాలని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


మొట్టమొదటిసారిగా 2002లో ఫుట్ పాత్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఇమ్రాన్ హస్మి మర్డర్ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇమ్రాన్ హస్మి.. ఎక్కువగా రొమాన్స్ చిత్రాలలోని నటిస్తూ ఉండడంతో రాను రాను అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ.. ఇక్కడ పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. మరి టాలీవుడ్ లో సక్సెస్ అయి పాన్ ఇండియా లెవల్లో విలన్ గా ఇమ్రాన్ హస్మి మారుతారేమో చూడాలి మరి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: బాలికపై అత్యాచారం.. డిప్యూటీ సీఎంను ఏకీపారేస్తున్న నెట్టిజెన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>