PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-duvwada-srinivas-1eda4600-6309-4a3b-8bbb-4273d9372cd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-duvwada-srinivas-1eda4600-6309-4a3b-8bbb-4273d9372cd3-415x250-IndiaHerald.jpgతాజాగా దువ్వాడ కుటుంబం వివాదం మొదటి భార్యతో పాటు.. ప్రియురాలు మాధురి రోడ్డుకు ఎక్కడంతో జగన్ దువ్వాడపై చర్యలకు ఉపక్రమించారు. అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అనుకున్నా.. అలా చేయకుండా టెక్కలి ఇన్చార్జి పగ్గాల నుంచి తప్పించారు. అయినా దువ్వాడ ఎంత మాత్రం వెనక్కు తగ్గటం లేదు. జగన్ చర్యలు తీసుకున్న తన పని తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలే జగన్ పరిస్థితి డోలయమానంలో పడిపోయింది. Duvwada Srinivas {#}Tekkali;Tirupati;Jagan;marriage;Love;Reddy;Party;Telugu;YCP;Telangana Chief Ministerజ‌గ‌న్ ఐ డోన్ట్ కేర్‌... దువ్వాడ శ్రీనివాస్ దురాగ‌తాలు...!జ‌గ‌న్ ఐ డోన్ట్ కేర్‌... దువ్వాడ శ్రీనివాస్ దురాగ‌తాలు...!Duvwada Srinivas {#}Tekkali;Tirupati;Jagan;marriage;Love;Reddy;Party;Telugu;YCP;Telangana Chief MinisterTue, 08 Oct 2024 13:28:44 GMTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది. జగన్‌ను దువ్వాడ ఏ మాత్రం లెక్క చేసే పరిస్థితి లేదు. తాజాగా దువ్వాడ కుటుంబం వివాదం మొదటి భార్యతో పాటు.. ప్రియురాలు మాధురి రోడ్డుకు ఎక్కడంతో జగన్ దువ్వాడపై చర్యలకు ఉపక్రమించారు. అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అనుకున్నా.. అలా చేయకుండా టెక్కలి ఇన్చార్జి పగ్గాల నుంచి తప్పించారు. అయినా దువ్వాడ ఎంత మాత్రం వెనక్కు తగ్గటం లేదు. జగన్ చర్యలు తీసుకున్న తన పని తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలే జగన్ పరిస్థితి డోలయమానంలో పడిపోయింది.


ఎన్నికల తర్వాత జగన్ గ్రాఫ్ చాలా వరకు డౌన్ అయింది. ఇప్పుడు జగన్ తనను తాను నిలబెట్టుకోవడంతోపాటు.. పార్టీ పరువు కూడా కాపాడాలి. ఇక దువ్వాడ రెండు నెలలుగా తన ప్రియురాలు మాధురితో లవ్ ఎఫైర్ పెట్టుకొని తెలుగు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అవ్వడంతో పాటు.. నవ్వులు పాలయ్యారు. భార్య, పెళ్లి అయిన‌ ఆడపిల్లలు ఉన్నా కూడా ఈ వయసులో ఇలా చేయటం ఏంటన్న విమర్శలు వస్తున్నా దువ్వాడ మాత్రం దర్జాగా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.


ఈ ఉత్సవాలకు లక్షల మంది భక్తులు వస్తున్నారు. వీరి మధ్య తన ప్రేమికురాలు మాధురిని.. వెంకటేశ్వర్లు దర్శనానికి తీసుకువెళ్లారు. అంతేకాదు.. ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకున్నారు. సాధారణంగా తిరుమల వంటి పవిత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కట్టుకున్న ధర్మపత్నితో వెళతారు. లేకపోతే ఒంటరిగా అయిన వెళ్తారు. కానీ.. ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్న వారిని దర్జాగా ప్రోటోకాల్ దర్శనాలకు తీసుకువెళ్లడం మీడియాకు ఫోజులు ఇవ్వడం.. దువ్వాడ దురాగతానికి ప్రతీక అని చెప్పాలి. పైగా అటు మాధురి.. తాను దువ్వాడ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ సంచలన కామెంట్లు చేయడం చూస్తుంటే దువ్వాడ వ్యవహారం ఎంత ముదిరిందో తెలుస్తోంది.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>