PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/people-dont-speak-about-trivikram-samantha-relationship7ae467c1-3483-4865-8da5-45b9d2823b8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/people-dont-speak-about-trivikram-samantha-relationship7ae467c1-3483-4865-8da5-45b9d2823b8d-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమా బన్నీ హీరోగా తెరకెక్కుతుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. trivikram srinivas{#}maya;Red chilly powder;Kshanam;Attharintiki Daredi;Hyderabad;trivikram srinivas;Shakti;Samantha;Event;Success;India;Cinemaసమంతను ట్రోల్ చేయాలంటున్న మాటల మాంత్రికుడు.. భారీ షాకిచ్చాడుగా!సమంతను ట్రోల్ చేయాలంటున్న మాటల మాంత్రికుడు.. భారీ షాకిచ్చాడుగా!trivikram srinivas{#}maya;Red chilly powder;Kshanam;Attharintiki Daredi;Hyderabad;trivikram srinivas;Shakti;Samantha;Event;Success;India;CinemaTue, 08 Oct 2024 22:03:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమా బన్నీ హీరోగా తెరకెక్కుతుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
 
సమంత, రానా, త్రివిక్రమ్ శ్రీనివాస్ జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ తర్వాత సమంత అంత పాపులర్ అని ఆయన పేర్కొన్నారు. ఏ మాయ చేశావే మూవీ నుంచి సమంత హీరో అని ఆమెకు వేరే శక్తి అక్కర్లేదని త్రివిక్రమ్ పేర్కొన్నారు. సమంత తానే ఓ శక్తి అని ఆయన వెల్లడించారు.
 
సమంత ముంబైలోనే ఉండకుండా అప్పుడప్పుడూ హైదరాబాద్ కు రావాలని సమంత సినిమాలు చేయడం లేదని మేము కథలు రాయడం లేదని ఆయన పేర్కొన్నారు. అత్తారింటికి దారేది సినిమాలా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అనాలేమో అని ఆయన వెల్లడించారు. సమంత రావాలని ట్రోల్ చేయాలంటూ త్రివిక్రమ్ కామెంట్లు చేశారు. జిగ్రా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుందని త్రివిక్రమ్ తెలిపారు.
 
అనుకున్న కథను అనుకున్న విధంగా చెప్పే ధైర్యం ఈ సినిమా దర్శకుడికి ఉందని ఆయన పేర్కొన్నారు. జిగ్రా సక్సెస్ తో మరింత ధైర్యం వస్తుందని ఆయన తెలిపారు. నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడనని ఏదైనా సహజంగా వస్తుందని అనుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్షణం ఉన్నట్టు తర్వాత క్షణం ఉండకూడదని ఫీలవుతానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఒక్కోసారి గెలుస్తుంటామని ఒక్కోసారి ఓడిపోతుంటామని త్రివిక్రమ్ వెల్లడించారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారకరత్న పిల్లలపై ఏకంగా అలాంటి ట్రోల్స్.. మీరు నిజంగా మనుషులేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>