MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jr-ntrs-jerky-move-turns-out-to-be-a-good-one-nowbd212407-01d8-4b10-ae18-84e0023106d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jr-ntrs-jerky-move-turns-out-to-be-a-good-one-nowbd212407-01d8-4b10-ae18-84e0023106d8-415x250-IndiaHerald.jpgదేవర1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దసరా సెలవులు ఈ సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి. సోమవారం రోజు కూడా దేవర కలెక్షన్లు బాగానే ఉన్నాయని ఇప్పటికే పలు ఏరియాలలో ఓవర్ ఫ్లోస్ మొదలయ్యాయని తెలుస్తోంది. వేట్టయాన్ మూవీ టాక్ ఆధారంగా దేవరకు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో తేలిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ntr{#}Korea; South;Ratnavelu;R Rathnavelu;Jr NTR;Mass;Dussehra;Vijayadashami;NTR;monday;Audience;Industry;Cinemaదేవర సీక్వెల్ నుంచి ఆయనను తప్పించడం పక్కా.. ఆ విమర్శలే కారణమా?దేవర సీక్వెల్ నుంచి ఆయనను తప్పించడం పక్కా.. ఆ విమర్శలే కారణమా?ntr{#}Korea; South;Ratnavelu;R Rathnavelu;Jr NTR;Mass;Dussehra;Vijayadashami;NTR;monday;Audience;Industry;CinemaTue, 08 Oct 2024 08:06:00 GMTదేవర1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దసరా సెలవులు ఈ సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి. సోమవారం రోజు కూడా దేవర కలెక్షన్లు బాగానే ఉన్నాయని ఇప్పటికే పలు ఏరియాలలో ఓవర్ ఫ్లోస్ మొదలయ్యాయని తెలుస్తోంది. వేట్టయాన్ మూవీ టాక్ ఆధారంగా దేవరకు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో తేలిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే దేవర సీక్వెల్ నుంచి రత్నవేలును తొలగించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ ను రత్నవేలు సరిగ్గా చూపించలేదని కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కామెంట్లు దేవర మేకర్స్ దృష్టికి వచ్చాయని అందువల్ల సీక్వెల్ లో రత్నవేలును తప్పించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ఈ ప్రచారంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
 
సౌత్ ఇండియాలోని టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు కాగా రత్నవేలును ఒకవేళ తొలగించకపోతే ఆయనకు కొన్ని సూచనలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర విషయంలో రత్నవేలు పూర్తిస్థాయిలో టాలెంట్ ప్రదర్శించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దేవర1 సినిమాను అదిరిపోయే ట్విస్టులతో ముగించిన మేకర్స్ దేవర2 సినిమాను సైతం అదే రేంజ్ లో ప్లాన్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
 
దేవర సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఈ నెల 13వ తేదీ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలో నటిస్తే ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో దేవర మూవీతో మరోసారి ప్రూవ్ కాగా ఆయుధపూజ సాంగ్ మాత్రం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆ సాంగ్ లో తారక్ డ్యాన్స్ స్టెప్స్ ను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. దేవర సినిమా సీక్వెల్ లో జాన్వీ రోల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆరా మస్తాన్ మరో బాంబు... బాబు బండారం బయటపడిందిగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>