PoliticsAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9bc653de-c038-433d-abf2-ccf8e56e300a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9bc653de-c038-433d-abf2-ccf8e56e300a-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు తాజాగా జగన్ బాబాయ్ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు అధికారం చలాయించిన కమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇక దీంతో వైసిపి చేతిలో ఉన్న‌ కమలాపురం మున్సిపాలిటీ ఇప్పుడు టిడిపిలోకి వెళ్లిపోయింది. త్వరలోనే కొత్త చైర్మన్ కూడా రాబోతున్నారు. ycp{#}Y. S. Rajasekhara Reddy;kadapa;Proddatur;Pulivendula;Tadepalli;Rajampet;Jagan;TDP;Reddy;District;Party;YCPకడపలో కదిలిపోతున్న వైసీపీ కూసాలు..!కడపలో కదిలిపోతున్న వైసీపీ కూసాలు..!ycp{#}Y. S. Rajasekhara Reddy;kadapa;Proddatur;Pulivendula;Tadepalli;Rajampet;Jagan;TDP;Reddy;District;Party;YCPTue, 08 Oct 2024 13:14:00 GMTకడప జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట .. అలాంటి కడపలో వైసీపీ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీ కేడ‌ర్ మొత్తం టిడిపిలోకి వెళ్ళిపోతున్నారు.. దాడులు, దౌర్జన్యాలు ఏమీ చేయకపోయినా రాజకీయ భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పార్టీ మారిపోతున్నారు. అయితే వారికి భరోసా కల్పించడంలో మాత్రం వైసిపి అధినాయకత్వం విఫలమైపోతుంది. ఇక ఇప్పుడు తాజాగా జగన్ బాబాయ్ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు అధికారం చలాయించిన కమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇక దీంతో వైసిపి చేతిలో ఉన్న‌ కమలాపురం మున్సిపాలిటీ ఇప్పుడు టిడిపిలోకి వెళ్లిపోయింది. త్వరలోనే కొత్త చైర్మన్ కూడా రాబోతున్నారు.

ఇక అలానే ప్రొద్దుటూరు , రాజంపేట  మున్సిపాలిటీలో పరిస్థితి కూడా ఇంతే. చివరగా కడప మేయర్ స్థానంలో టిడిపికి అధికారకంగా ఒక్క‌ కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది కార్పొరేటర్లంతా టిడిపిలోకి రావడానికి సై అంటున్నారు. జగన్ సొంత జిల్లాలోనే ఇంత దారుణంగా ఉంటే .. అయిన ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా టిడిపి వైపు చూస్తున్నారు. ప్రధానంగా గతం అధికారంలో ఉన్నప్పుడు జగన్ వారికి ఎన్నో కాంట్రాక్టర్లు ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీ కోసం కాకపోయినా బిల్లుల కోసమైనా టిడిపిలోకి వెళ్ళిపోతామని వారు సంకేతాలు పంపుతున్నారు. టిడిపి నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు.

ఇక కడప జడ్పీ చైర్మన్ పీఠం కూడా వైసీపీ నుంచి చేయి జారిపోతుంది.. అందుకు ప్రత్యేకంగా జగన్ జడ్పీటీసీలు అందర్నీ తాడేపల్లి పిలిపించుకుని బతిమాలుకున్నారు ..తన పరువు తీయొద్దని అడిగి మరి... వారికి తల ఓ తైలం కూడా ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీని ముందు నూంచి నడిపించే నాయకుడే కడప జిల్లాలో కనుమరుగైపోయారు. ఇప్పుడు చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డిని నియమించగా ఆ నిర్ణయమే అయ‌నకు మరింత తలనొప్పులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>