PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-revanth-reddyd8707d48-7d72-488c-bd94-9c33ab13e92c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-revanth-reddyd8707d48-7d72-488c-bd94-9c33ab13e92c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పెను సంచనాలే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు పది నెలలు పూర్తయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనలో... జనాల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీలు అంటూ గారడి చేసిన కాంగ్రెస్... ఇప్పుడు చేతులెత్తేసింది. cm revanth reddy{#}Revanth Reddy;December;electricity;Congress;Party;News;Telanganaజన్మలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చేస్తున్న రేవంత్‌ ?జన్మలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చేస్తున్న రేవంత్‌ ?cm revanth reddy{#}Revanth Reddy;December;electricity;Congress;Party;News;TelanganaSun, 06 Oct 2024 11:31:00 GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పెను సంచనాలే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు పది నెలలు పూర్తయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనలో... జనాల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీలు అంటూ గారడి చేసిన కాంగ్రెస్... ఇప్పుడు చేతులెత్తేసింది.


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు,  సాగునీరు సమస్యలు, నిరుద్యోగుల నిరసనలు, జీతాలు అందక ఉద్యోగుల బాధలు, వృద్ధాప్య పింఛన్ సమయానికి అందకపోవడంతో... వృద్ధుల  బాధలు మాత్రమే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన.. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప మెచ్చుకున్నవారే కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.


గడిచిన 10 సంవత్సరాల గులాబీ పార్టీ అధికారంలో.. కొన్ని అవకతవకులు జరిగినా కూడా.. అభివృద్ధి మాత్రం జరిగింది. జనాలు ప్రశాంతంగా పడుకున్నారు. ప్రశాంతంగా పని చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అనే భయం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా హైదరాబాదులో హైడ్రా పేరుతో... కాంగ్రెస్ డ్రామాలు వాడుతోంది. 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే... అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూడా పడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది.


కోట్ల విలువైన ఇండ్లను కూల్చి... జనాలను వేధిస్తోంది కాంగ్రెస్ సర్కార్. సోషల్ మీడియాలో ఈ వార్తలను పోస్ట్ చేస్తే కూడా శిక్షలు వేసేందుకు వెనకడం లేదట కాంగ్రెస్ సర్కార్. ఇక ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో... దాదాపు 20 వేల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూసి ప్రక్షాళన చేయాలి కానీ... మూసి సుందరీకరణ పేరుతో...  జనాలను రోడ్డున పడేయడం ఏంటని ప్రతిపక్షాలతో పాటు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు బంధు సరిగా పడడం లేదని రైతులు ఆందోళన  చేస్తున్నారు. రుణమాఫీ సగానికి ఆగిపోయింది. ఇలా అన్ని రంగాల్లో.. రేవంత్ రెడ్డి సర్కార్... అట్టర్ ఫ్లాప్ అయిందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. కాంగ్రెస్ జన్మలో అధికారంలోకి రాదని చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>