MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobhita-dhulipala-wants-to-become-a-mother6a606d39-89b3-43f5-851d-974e58c231c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobhita-dhulipala-wants-to-become-a-mother6a606d39-89b3-43f5-851d-974e58c231c8-415x250-IndiaHerald.jpgసమంత అనే పేరు వింటే చాలామంది స్టార్ హీరోయిన్ సమంత అని భావిస్తారు. అయితే హీరోయిన్ శోభిత సోదరి పేరు కూడా సమంత అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మిస్ ఇండియా పోటీలతో కెరీర్ ను మొదలుపెట్టి శోభిత మోడల్ గా అవకాశాలను దక్కించుకున్నారు. shobhita{#}shobitha;engineer;Heroine;Samantha;media;Father;Indiaసమంత నా సోల్ మేట్ అంటున్న శోభిత.. ఆ కామెంట్లతో భారీ షాకిచ్చిందిగా!సమంత నా సోల్ మేట్ అంటున్న శోభిత.. ఆ కామెంట్లతో భారీ షాకిచ్చిందిగా!shobhita{#}shobitha;engineer;Heroine;Samantha;media;Father;IndiaSun, 06 Oct 2024 09:01:00 GMTసమంత అనే పేరు వింటే చాలామంది స్టార్ హీరోయిన్ సమంత అని భావిస్తారు. అయితే హీరోయిన్ శోభిత సోదరి పేరు కూడా సమంత అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మిస్ ఇండియా పోటీలతో కెరీర్ ను మొదలుపెట్టి శోభిత మోడల్ గా అవకాశాలను దక్కించుకున్నారు.
 
త్వరలో శోభిత నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్నారు. తన సినీ కెరీర్ గురించి ఆమె మాట్లాడుతూ లక్ష్యం లేకుండానే సినీ రంగంలోకి వచ్చానని తెలిపారు. మోడల్ గా అడిషన్స్ కు వెళ్లే క్రమంలో ఎదురైన కొన్ని ఘటనలు ఇబ్బంది పెట్టాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సంఘటనలే నాలో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంచాయని శోభిత పేర్కొన్నారు. నా ప్రయాణం ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.
 
నేను తెనాలిలో పుట్టానని నాన్న వైజాగ్ లో నేవీ ఇంజనీర్ గా పని చేయడంతో అక్కడే పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా పని చేయాలని నా కల అని శోభిత కామెంట్లు చేశారు. మా చెల్లి సమంత నా సోల్ మేట్ అని శోభిత అన్నారు. ఈ మధ్యనే సమంతకు పెళ్లైందని కెరీర్ పరంగా బిజీగా ఉండి కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
 
చెల్లి పెళ్లిలో అందరినీ కలుసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అన్ని పనులు చూసుకుంటూనే నేనూ చెల్లిలా తయారవ్వాలని అనుకున్నానని శోభిత పేర్కొన్నారు. నాకు భక్తి ఎక్కువని ఉదయాన్నే పూజలు, సూర్యాష్టకం చదవడం అలవాటని ఆమె చెప్పుకొచ్చారు. నేను శాకాహారినని అయితే వంట మాత్రం బాగా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మా అని పిలిపించుకోవాలని నా కోరిక అని శోభిత ధూళిపాల  తెలిపారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>