PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/everything-is-ready-for-the-sit-investigation33626417-f1da-4597-ae5b-3d08c367c269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/everything-is-ready-for-the-sit-investigation33626417-f1da-4597-ae5b-3d08c367c269-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారంపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సిట్ టీమ్‌లో ఇద్దరు కేంద్ర అధికారులు, ఇద్దరు ఏపీ అధికారులు, ఓ క్వాలిటీ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు. సిట్ విచారణను సీబీఐ పర్యవేక్షిస్తుంది. కొత్త సిట్ లో కేంద్రం ఏపీ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. కేంద్ర ప్రభుత్వమే ఇద్దరు అధికారులను సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదటీటీడీ {#}Sri Venkateswara swamy;Tirumala Tirupathi Devasthanam;central government;Jagan;CBI;Tirupati;Andhra Pradesh;Yevaru;CBN;Newsసిట్ విచారణకు సర్వం సిద్ధం.. ఆ తేదీతో చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలు..?సిట్ విచారణకు సర్వం సిద్ధం.. ఆ తేదీతో చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలు..?టీటీడీ {#}Sri Venkateswara swamy;Tirumala Tirupathi Devasthanam;central government;Jagan;CBI;Tirupati;Andhra Pradesh;Yevaru;CBN;NewsSun, 06 Oct 2024 11:30:05 GMTసుప్రీంకోర్టు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారంపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సిట్ టీమ్‌లో ఇద్దరు కేంద్ర అధికారులు, ఇద్దరు ఏపీ అధికారులు, ఓ క్వాలిటీ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు. సిట్ విచారణను సీబీఐ పర్యవేక్షిస్తుంది. కొత్త సిట్ లో కేంద్రం ఏపీ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. కేంద్ర ప్రభుత్వమే ఇద్దరు అధికారులను సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులను ఎంపిక చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సిట్ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఫిక్స్‌డ్‌ షెడ్యూల్ ప్రకటించలేదు. సిట్ సభ్యుల నియామకం ఎప్పుడు, వారు విచారణ ప్రారంభించేది ఎప్పుడు అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. టీటీడీ అధికారులకు ఈ వేడుకల పనులతోనే బిజీ అయిపోయారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసే ఏం పనుల్లో నిమగ్నమయ్యారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 12తో ముగియనుండగా అప్పటిదాకా టీటీడీ అధికారులు సిట్ విచారణకు ఏమాత్రం సహకరించే అవకాశం లేదు.

అయితే 12వ తేదీలోగా సిట్ సభ్యుల నియామకం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఏర్పాటైన కొత్త సిట్ టీమ్‌ ఈ నెల 12 నుంచి విచారణ ప్రారంభించి ఈ నెలలోపు అన్ని నిజాలను బయటపెట్టే అవకాశం ఉంది. సీబీఐ పర్యవేక్షణలో కొత్త సిట్ అన్ని అంశాలు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అన్ని కోణాల్లో ఏ ఒక్క సమాచారం కూడా వదిలిపెట్టకుండా సిట్ సమగ్ర దర్యాప్తు చేపడుతుంది సీబీఐ డైరెక్టర్, ఏపీ డీజీపీ ఒక్కొక్కరు ఇద్దరి చొప్పున మొత్తం నలుగురు అధికారులను సెలెక్ట్ చేస్తారు. వీరు ఇచ్చే రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా అనేది తేలనుంది. చంద్రబాబు లడ్డూ విషయంలో జగన్ పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఆరోపణ చేశారా అనేది కూడా తెలిసిపోతుంది ఆయన నిజ స్వరూపం అనేది ఏపీ ప్రజలతో పాటు మొత్తం భారతదేశానికి తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>