MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined ఆయన భార్య కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. గతంలో హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె పేరు నిరోష.. రామ్‌కి, నిరోషా కలిసి సింధూరపువ్వు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సింధూరపువ్వు అంటూ వచ్చే పాట ఎంతో సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ ఆ పాటను వింటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిరోషా రామ్ కి ప్రేమలో పడ్డారు. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి టాలీవుడ్‌ స్టార్ హీరోలతో కలిసి నిరోషా సినిమాలు చేసింది. balayya actor ramki updates{#}dasari narayana rao;mohan babu;nirosha;radhika;RX100;Murari;Osey Ramulamma;Wife;ram pothineni;marriage;Father;Tamil;Telugu;Cinema;Hero;Kollywoodఆ సీనియర్ హీరో భార్య, కూతురు.. బాలయ్యకు అంత ఇష్టమా..!ఆ సీనియర్ హీరో భార్య, కూతురు.. బాలయ్యకు అంత ఇష్టమా..!balayya actor ramki updates{#}dasari narayana rao;mohan babu;nirosha;radhika;RX100;Murari;Osey Ramulamma;Wife;ram pothineni;marriage;Father;Tamil;Telugu;Cinema;Hero;KollywoodSun, 06 Oct 2024 14:44:00 GMTతమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ నటన్ని గుర్తుపట్టారా? ఆర్ఎక్స్ 100 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అజ‌య్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డాడీ పాత్రలో నటించాడు ఆయన. ఆయన అసలు పేరు రామ్‌కీ ఈ సినిమాలో హీరోకి తండ్రిగా ఉంటూ పెళ్లి చేసుకోకుండా ఊర్లో కుర్రాళ్లకు పెద్దగా ఉంటాడు. ఆర్ఎక్స్ 100 మూవీలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఈయన అసలు పేరు రామకృష్ణ. ఒకప్పుడు రామ్‌కీ హీరోగా నటించి ప్రేక్షకుల మనుసులు దోచుకున్నాడు. ఘటన, భలే ఖైదీలు, దోషి వంటి సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు. అలాగే విజయశాంతి, దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అయితే స్టార్ హీరో వైఫ్ ని ఎప్పుడైనా చూసారా.. ఆయన భార్య ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.


ఆయన భార్య కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. గతంలో హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె పేరు నిరోష.. రామ్‌కి, నిరోషా కలిసి సింధూరపువ్వు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సింధూరపువ్వు అంటూ వచ్చే పాట ఎంతో సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ ఆ పాటను వింటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిరోషా రామ్ కి ప్రేమలో పడ్డారు. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి టాలీవుడ్‌ స్టార్ హీరోలతో కలిసి నిరోషా సినిమాలు చేసింది. ఈ క్రమంలో బాలయ్యకు జంటగా నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది.


అలాగే తెలుగులో ఈ ముద్దుగుమ్మ 30 సినిమాలకు పైగా నటించింది. అదేవిధంగా కోలీవుడ్ లో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. అక్కడ ఈమె దాదాపు 100 సినిమాలకు పైగా చేసింది. 1995 లో నిరోష రామ్‌కిని పెళ్లి చేసుకుంది. ఇక రామ్‌కీకి ఓ అన్న కూడా ఉన్నాడు. ఆయన మ‌రి ఎవ‌రో కాదు సీనియర్ హీరో శరత్ కుమార్. ఆయన కూతురు వరలక్ష్మీ రామ్‌కీకి వరసకు కూతురు అవుతుంది. రాధిక శరత్ కుమార్.. రామ్‌కీకు వదిన అవుతుంది. చాలా మందికి రామ్‌కీకి ఫ్యామిలీ గురించి పెద్ద‌గా తెలియ‌దు.  రామ్‌కీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే నిరోషా కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా నిరోషా , వరలక్ష్మీ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సభలో.. కాంగ్రెస్ మహిళ నేతకి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>