MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan3f2c76f0-12b5-424a-aef2-8a8df8b0f1d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan3f2c76f0-12b5-424a-aef2-8a8df8b0f1d7-415x250-IndiaHerald.jpg అయితే చిరంజీవి మొదటిలో తన సినిమాల కథల విషయంలోనే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా కథలను సెలెక్ట్ చేసి సినిమాలు తీయించేవాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా విషయంలో చిరంజీవి వద్దని చెప్పినా కూడా పవన్ వినకుండా ఆ సినిమాను చేశాడు. చివరకు ఆ సినిమా ఫలితం ఏమైంది అనే విషయం పక్కన పెడితే కథల విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుంది. Pawan Kalyan{#}Tammudu;Gudumba Shankar;Gabbar Singh;Chiranjeevi;Darsakudu;Success;kalyan;Director;Industry;Cinemaఅన్నను ఎదిరించిన పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా వినలేదుగా.. ఫలితం ఇదే..!అన్నను ఎదిరించిన పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా వినలేదుగా.. ఫలితం ఇదే..!Pawan Kalyan{#}Tammudu;Gudumba Shankar;Gabbar Singh;Chiranjeevi;Darsakudu;Success;kalyan;Director;Industry;CinemaSun, 06 Oct 2024 16:47:02 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని స్టార్‌డంతో దూసుకుపోతున్నాడు. ఆయన ఒక స్టోరీని సెలెక్ట్ చేశాడు అంటే కథలో ఎన్నో ఊహించని వైవిద్యమైన సంగతులు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చిరంజీవి మొదటిలో తన సినిమాల కథల విషయంలోనే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా కథలను సెలెక్ట్ చేసి సినిమాలు తీయించేవాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా విషయంలో చిరంజీవి వద్దని చెప్పినా కూడా పవన్ వినకుండా ఆ సినిమాను చేశాడు. చివరకు ఆ సినిమా ఫలితం ఏమైంది అనే విషయం పక్కన పెడితే కథల విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుంది.


అయినా ఒక సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా హిట్ అవుద్దనే చెప్పాలి. ఎక్కడో ఒకచోట చిన్న లోపం జరిగితే తప్ప ఆ సినిమా ప్లాఫ్ అవదు అని అంటారు.  అందు కారణంగానే ఆయన గతంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సాధించి మెగాస్టార్‌గా ఎదిగారు. అలాగే కథల విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలాంటి సమయంలో పవన్ చేసిన గుడుంబా శంకర్ సినిమా క‌థ‌ను ముందుగా చిరంజీవి విన్నాడట.


ఆ స్టోరీ చిరంజీవికి పెద్దగా  నచ్చకపోవడంతో ఆ సినిమాను వదిలేయమని పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దర్శకుడు వీరశంకర్ కి సినిమా చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి తన మాటను వెనక్కి తీసుకోలేక ఆ సినిమాను చేశాడు. చివరకు ఆ సినిమా చిరంజీవి చెప్పినట్టే ప్లాప్ గా మిగిలిపోయింది. అలా ఆ సినిమా దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ వరుసగా అప‌జ‌య‌ల‌ని ఎదుర్కొన్నాడు . మళ్లీ ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా వచ్చిందో అప్పుడు మంచి సక్సెస్ సాధించి.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాడు . ఇలా అన్న చిరంజీవి జడ్జ్మెంట్లో చాలా వరకు నిజాయితీ ఉంటుందని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంతను అంత‌ మాట నేసిన అక్కినేని కోడలు.. వింటే కలలో నీళ్లు తిరుగుతాయి..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>