MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-viswam-movie-trailer-srinuvitlaafc63b69-2feb-4cd9-b179-032e453f36f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-viswam-movie-trailer-srinuvitlaafc63b69-2feb-4cd9-b179-032e453f36f4-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బారి బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తోంది. ఇప్పటికే విశ్వం చిత్రం నుంచి విడుదలైన టీజర్ మేకింగ్ సాంగ్స్ వంటివి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా విశ్వం ట్రైలర్ విడుదల చేయగా అది కూడా ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశ్వం ట్రైలర్ విషయానికి వస్తే.. బార్డర్ దగ్GOPICHAND VISWAM;MOVIE;TRAILER;SRINUVITLA{#}Naresh;allari naresh;kavya thapar;srikanth;vennela kishore;Dussehra;Bari;Comedian;Army;sunil;rahul;Rahul Sipligunj;Chitram;Comedy;srinivas;Vijayadashami;Success;Director;Population;Heroine;Blockbuster hit;Cinema;Hero;Chequeవిశ్వం ట్రైలర్: కామెడీతో హిట్ కొట్టేలా ఉన్న గోపీచంద్- శ్రీనువైట్ల..ట్రైలర్ అదుర్స్..!విశ్వం ట్రైలర్: కామెడీతో హిట్ కొట్టేలా ఉన్న గోపీచంద్- శ్రీనువైట్ల..ట్రైలర్ అదుర్స్..!GOPICHAND VISWAM;MOVIE;TRAILER;SRINUVITLA{#}Naresh;allari naresh;kavya thapar;srikanth;vennela kishore;Dussehra;Bari;Comedian;Army;sunil;rahul;Rahul Sipligunj;Chitram;Comedy;srinivas;Vijayadashami;Success;Director;Population;Heroine;Blockbuster hit;Cinema;Hero;ChequeSun, 06 Oct 2024 12:52:00 GMTడైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బారి బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తోంది. ఇప్పటికే విశ్వం చిత్రం నుంచి విడుదలైన టీజర్ మేకింగ్ సాంగ్స్ వంటివి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా విశ్వం ట్రైలర్ విడుదల చేయగా అది కూడా ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది.


విశ్వం ట్రైలర్ విషయానికి వస్తే.. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచి పెడుతూ ఉంటే.. నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో గోపీచంద్ మరొకసారి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. అలాగే గోపీచంద్ యాక్షన్స్ సన్నివేశాలతో పాటు డైరెక్టర్ శ్రీనువైట్ల కామెడీ పంచులు ఈ సినిమాలో బాగానే పేలుతున్నట్లు కనిపిస్తోంది. కమెడియన్స్ తో ఆడించిన ఆటలు కూడా పేలేలా కనిపిస్తున్నాయి. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ప్రస్తుతమైతే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు.


ట్రైలర్లో సునీల్ తన నటనతో మరొకసారి ఆకట్టుకుంటున్నారు. గోపీచంద్ ఉగ్రవాదులను అరికట్టే ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.. మరొక కమెడియన్ భరత్ కూడా ఇందులో కనిపించబోతున్నారు. అలాగే మరొక నటి ప్రగతి, వీకే నరేష్ , వెన్నెల కిషోర్ , గణేష్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇందులో నటిస్తూ ఉన్నారు. ట్రైలర్ తో వచ్చిన హైట్ తో కచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో గోపీచంద్.. గత కొన్నేళ్లుగా డైరెక్టర్ శ్రీను వైట్లకు సరైన సక్సెస్ అందలేదు మరి విశ్వం సినిమాతో సక్సెస్ అందుకొని అన్నిటికీ చెక్ పెడతారేమో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>