LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/risks--health--caused--phone-mobile-mobile-phonee865d989-3682-4e41-9526-387b9f3cf8eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/risks--health--caused--phone-mobile-mobile-phonee865d989-3682-4e41-9526-387b9f3cf8eb-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి మొబైల్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ లేకపోతే ఏ పని కూడా జరగటం లేదు. ఈ డిజిటల్ యుగంలో ఆహారం, నీరు మాదిరిగానే సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కమ్యూనికేషన్, సులభంగా సమాచారం పొందడం ఎందుకు కారణం. కాగా అతి వినియోగం ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రకు ఆటంకాల నుంచి మానసిక సమస్యల వరకు ఎన్నో ప్రమాదాలు ఉండగా.. స్త్రీన్ సమయం పరిమితం చేయటం, జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఎక్కువ సేపు స్మాల్ స్క్రీన్ చూస్తూ ఉండటం వలన కంటి ఒత్తిడికి దారి తrisks ; health ; caused ; phone; mobile; mobile phone{#}Smart phone;News;mediaమొబైల్ ఫోన్ ఉపయోగించటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఇవే..?మొబైల్ ఫోన్ ఉపయోగించటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఇవే..?risks ; health ; caused ; phone; mobile; mobile phone{#}Smart phone;News;mediaSat, 05 Oct 2024 12:15:00 GMTఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి మొబైల్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ లేకపోతే ఏ పని కూడా జరగటం లేదు. ఈ డిజిటల్ యుగంలో ఆహారం, నీరు మాదిరిగానే సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కమ్యూనికేషన్, సులభంగా సమాచారం పొందడం ఎందుకు కారణం. కాగా అతి వినియోగం ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రకు ఆటంకాల నుంచి మానసిక సమస్యల వరకు ఎన్నో ప్రమాదాలు ఉండగా.. స్త్రీన్ సమయం పరిమితం చేయటం, జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఎక్కువ సేపు స్మాల్ స్క్రీన్ చూస్తూ ఉండటం వలన కంటి ఒత్తిడికి దారి తీయవచ్చు.

 దీనిని సాధారణంగా ' డిజిటల్ ఐ స్ట్రెయిన్' లేదా 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ స్క్రీన్స్ బ్లూ లైట్ ను విడుదల చేస్తాయి, ఇది కళ్ళలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది, ఇది అస్పష్టమైన దృష్టి, పొడి కళ్ళు, తలనొప్పి, ఫోకస్ చేయటంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఆధ్యాయనం ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, దీన్ని యూస్ చేయనివారితో పోలిస్తే కంటి నొప్పి, కళ్ళు పొడిబారటం ప్రమాదం 39.7 శాతం ఎక్కువ ఉంటుంది.

సోషల్ మీడియా ద్వారా టెక్స్ట్ చేసుకున్నప్పుడు లేదా స్కోరింగ్ చేస్తున్నప్పుడు.. కుంగిపోయిన స్థితిలో కూర్చోవటం సాధారణం. కాగా ఈ భంగిమ వల్ల సాధారణంగా టెక్స్ట్ నెక్ అని పిలవబడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఫోన్ ని ఉపయోగిస్తున్నప్పుడు మీ తలను ఎక్కువ సేపు ముందుకు ఉంచడం వల్ల మీ మెడ, భుజాలలోని కండరాలు దృఢంగా, నొప్పిగా మారినప్పుడు ఇది జరుగుతుంది. టెక్స్ట నెక్ దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది. పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమస్యలకు కూడా దారితీస్తుంది. పీర్ జర్నల్ ప్రచురించిన అధ్యాయనంలో మొబైల్ ఫోన్ వినియోగదారులలో నెక్ డిజార్డర్స్, టెక్స్ట నెక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>