PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/komaram-puli312026b6-7726-473c-a4b5-67ebeb071329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/komaram-puli312026b6-7726-473c-a4b5-67ebeb071329-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్జే సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఖుషి విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో కొమరం పులి తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శింగనమల రమేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. komaram puli{#}kushi;ramesh babu;surya sivakumar;Kushi;Komaram Bheem;Heroine;Sardar Vallabhai Patel;kalyan;advertisement;Kathanam;Success;Industry;Cinemaఅప్పట్లోనే నిర్మాతకు రూ.12 కోట్ల నష్టం మిగిల్చిన కొమరం పులి.. పవన్ మూవీకి అదే మైనస్!అప్పట్లోనే నిర్మాతకు రూ.12 కోట్ల నష్టం మిగిల్చిన కొమరం పులి.. పవన్ మూవీకి అదే మైనస్!komaram puli{#}kushi;ramesh babu;surya sivakumar;Kushi;Komaram Bheem;Heroine;Sardar Vallabhai Patel;kalyan;advertisement;Kathanam;Success;Industry;CinemaSat, 05 Oct 2024 08:45:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్జే సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఖుషి విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో కొమరం పులి తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శింగనమల రమేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
 
తల, తోక లేని కథనం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. అప్పట్లోనే నిర్మాతకు ఈ సినిమాకు 12 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. ఈ సినిమాలో పవన్ లుక్ కు మంచి మార్కులు పడినా పవన్ కోసం రాసిన డైలాగ్స్ విషయంలో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయనే సంగతి తెలిసిందే. నికిషా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె పర్ఫామెన్స్ సైతం మూవీకి మైనస్ అయింది.
 
ఖలేజా, కొమరం పులి సినిమాలు మిగిల్చిన నష్టాల వల్ల తర్వాత కాలంలో శింగనమల రమేష్ బాబు నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు. కొమరం పులి సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత రోజుల్లో పవన్, ఎస్జే సూర్య కాంబినేషన్ లో సైతం సినిమాలు రాలేదనే చెప్పాలి. పవన్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్స్ ఆలస్యమవుతున్నాయి.
 
పవన్ ప్రజా సేవకే పరిమితం కావడంతో పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రావడం అయితే సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలు రిలీజ్ డేట్లను తరచూ మార్చుకుంటున్నాయి. వచ్చే ఏడాది అయినా పవన్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది. యూత్ లో మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పవన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>