MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-s-vettayan2a324c35-75c8-4c0c-be65-189da0358079-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-s-vettayan2a324c35-75c8-4c0c-be65-189da0358079-415x250-IndiaHerald.jpgజైలర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత మరోసారి అలాంటి స్టోరీలో నటించాడు అదే ‘వేట్టయన్’.. ఈనెల 10న‌ ప్రేక్షకులు ముందుకు రానుంది. దసరా సెలవుల సీజన్ లో విడుదల కానున్న తొలి తమిళ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో మెయిన్ విలన్ ఎవరనేది చెప్పకుండా ఆడియన్స్ లో మరింత కన్ఫ్యూజన్ పెంచింది. Rajini s Vettayan{#}Dussehra;Rajani kanth;Amitabh Bachchan;Traffic police;Music;Tamil;Darsakudu;Audience;Director;Cinema;Variarరజిని ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!రజిని ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!Rajini s Vettayan{#}Dussehra;Rajani kanth;Amitabh Bachchan;Traffic police;Music;Tamil;Darsakudu;Audience;Director;Cinema;VariarSat, 05 Oct 2024 11:31:37 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జైలర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత మరోసారి అలాంటి స్టోరీలో నటించాడు అదే ‘వేట్టయన్’.. ఈనెల 10న‌ ప్రేక్షకులు ముందుకు రానుంది. దసరా సెలవుల సీజన్ లో విడుదల కానున్న తొలి తమిళ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో మెయిన్ విలన్ ఎవరనేది చెప్పకుండా ఆడియన్స్ లో మరింత కన్ఫ్యూజన్ పెంచింది.


ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపెట్టడంతో సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్‌ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. ఇక ట్రైలర్లో రజనీకాంత్ మూవీస్ లోని వావ్ మూమెంట్స్ లేవు. అలాగే అనిరుధ్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా లేదు. జైలర్ బ్లాక్‌బాస్టర్ విజయాన్ని ‘వేట్టయన్’ కనుమరుగు చేస్తుందా లేక లాల్ సలాం లాగా డిజాస్టర్ అవుతుందని చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. సినిమాపై మిక్స్డ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ రజినీకాంత్ కెరియర్ లో ఇది మరో మరో బిగ్‌స్ట్ హిట్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని దర్శకుడు జ్ఞానువేల్ తెరకెక్కించగ.. ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.


ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, ఈ చిత్ర ఔట్‌పుట్‌ని చూసి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని తన సోషల్ మీడియాలో తనదైన మార్క్ రివ్యూ ఇచ్చాడు. అనిరుధ్ గతంలోనూ పలు సినిమాలకు రివ్యూ ఇవ్వగా, అవి విజయాన్ని అందుకున్నాయి. ఇక వేట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>