PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/can-nag-handle-bigg-boss-despite-all-odds0042d141-f881-4948-82c1-ebd9c53d636b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/can-nag-handle-bigg-boss-despite-all-odds0042d141-f881-4948-82c1-ebd9c53d636b-415x250-IndiaHerald.jpgకేంద్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ అమ్మాయిలకు అనుకూలంగా చట్టాలు ఉన్నప్పటికీ పరిస్థితులలో మాత్రం పెద్దగా మార్పు రావట్లేదు. సమంతలాంటి స్టార్ హీరోయిన్ ను సైతం టార్గెట్ చేస్తూ రాయడానికి కూడా వీలు లేనంత అసభ్యంగా కామెంట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ ఎంతలా సమర్థించుకున్నా ఇప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయిందనే చెప్పాలి. nagarjuna{#}Samantha;Akkineni Nagarjuna;surekha vani;media;Industry;Heroine;Teluguనాగ్ దావాతో సురేఖకు తిప్పలు.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనా?నాగ్ దావాతో సురేఖకు తిప్పలు.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనా?nagarjuna{#}Samantha;Akkineni Nagarjuna;surekha vani;media;Industry;Heroine;TeluguFri, 04 Oct 2024 08:38:00 GMTకేంద్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ అమ్మాయిలకు అనుకూలంగా చట్టాలు ఉన్నప్పటికీ పరిస్థితులలో మాత్రం పెద్దగా మార్పు రావట్లేదు. సమంతలాంటి స్టార్ హీరోయిన్ ను సైతం టార్గెట్ చేస్తూ రాయడానికి కూడా వీలు లేనంత అసభ్యంగా కామెంట్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ ఎంతలా సమర్థించుకున్నా ఇప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయిందనే చెప్పాలి.
 
మరోవైపు నాగార్జున ఇప్పటికే పరువు నష్టం దావా దాఖలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెబితే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. నాగార్జున తన పరువుకు భంగం కలిగించేలా సురేఖ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూను ఒకింత సీరియస్ గానే తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు కూడా లేవు.
 
ఇండస్ట్రీ నుంచి కూడా నాగార్జునకు పూర్తిస్థాయిలో మద్దతు లభించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నాగార్జున వరుస వివాదాల నేపథ్యంలో సైలెంట్ గా ఉంటే తప్పును అంగీకరించినట్టు అవుతుందని భావించినట్టు తెలుస్తోంది. సమంత సైతం ఈ వివాదం విషయంలో కోర్టును ఆశ్రయిస్తారేమో చూడాల్సి ఉంది. నాగార్జున కెరీర్ పై కూడా వివాదాలు ఒకింత ప్రభావం చూపుతున్నాయి.
 
నాగార్జున భవిష్యత్తులో సైతం తమ ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేసే వాళ్ల విషయంలో ఇంతే ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాగ్ ఫ్యామిలీకే ఎందుకిలా జరుగుతోందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగార్జునను ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగ్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>