Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak25b54ae2-8c42-4089-b850-49607a8d411b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak25b54ae2-8c42-4089-b850-49607a8d411b-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని టీం గా ప్రస్థానం కొనసాగించిన పాకిస్తాన్ జట్టు.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. జట్టులో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ప్రదర్శన తీరు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అన్న విషయం తెలిసిందే. చిన్న టీమ్స్ చేతుల్లో సైతం దారుణ పరాజయాలు చవిచూస్తూ రోజురోజుకీ పతనం అయ్యే స్థాయికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ జట్టు. ఇప్పుడు కనీస ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే జట్టులో ఉన్న కోచింగ్ సిబ్బంది దగ్గpak{#}Babur;Prasthanam;Pakistan;Bangladesh;Cricketపాపం పాకిస్థాన్ క్రికెటర్లు.. ఈ విషయం తెలిస్తే మీరు కూడా జాలి పడతారు?పాపం పాకిస్థాన్ క్రికెటర్లు.. ఈ విషయం తెలిస్తే మీరు కూడా జాలి పడతారు?pak{#}Babur;Prasthanam;Pakistan;Bangladesh;CricketFri, 04 Oct 2024 15:45:00 GMTఒకప్పుడు ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని టీం గా ప్రస్థానం కొనసాగించిన పాకిస్తాన్ జట్టు.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. జట్టులో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ప్రదర్శన తీరు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అన్న విషయం తెలిసిందే. చిన్న టీమ్స్ చేతుల్లో సైతం దారుణ పరాజయాలు చవిచూస్తూ రోజురోజుకీ పతనం అయ్యే స్థాయికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ జట్టు. ఇప్పుడు కనీస ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే జట్టులో ఉన్న కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి కెప్టెన్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా మార్చిన అటు పాకిస్తాన్ ఆటతీరులో మాత్రం మార్పు రాలేదు. అదే సమయంలో ఇక పాకిస్తాన్ క్రికెట్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావడం కూడా ఆ దేశ క్రికెట్ పతనం కావడానికి కారణాలుగా మారిపోతున్నాయి అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు  వారి దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం చివరికి క్రికెటర్ల వరకు చేరింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కనీసం క్రికెటర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.


 దీంతో పాకిస్తాన్ క్రికెట్ రోజు రోజుకి తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి, ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలుగుతున్నట్లు ప్రకటన చేయడం, ఇక బోర్డు మార్పులతో గందరగోల పరిస్థితి నెలకొనడం జరుగుతుంది. అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లకు సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ ఆ మారింది. ఈ విషయం తెలిస్తే ఇక ఆ దేశ క్రికెటర్ల పై ప్రతి ఒక్కరికి జాలి కలుగుతుంది. పాకిస్తాన్ తరపున ఆడుతున్న ఉమెన్, మెన్ క్రికెటర్లకు 4 నెల నుండి జీతాలు అందడం లేదట. 25 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ 2026 వరకు ఉండగా.. త్వరలోనే సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. జెర్సీలపై లోగో స్పాన్సర్షిప్ పేమెంట్లు కూడా రావట్లేదు. చివరికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశ జట్టు తరఫున ఆడుతున్నారు అన్న విషయం బయటపడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>